Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గత నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది.
Ather Energy sales సందర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ “ 82,146 వాహనాల రిటైల్ అమ్మకాలతో గణనీయమైన వృద్ధిని సాధించామని, చిప్ కొరత కారణంగా ఈ FYలో మొదటి 6 నెలలపాటు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. 2023 మార్చిలో డెలివరీ చేయబడిన 11,754 యూనిట్లతో ఈ సంవత్సరాన్ని విజయవంతంగా ముగించామని చెప్పారు. ఇది సంవత్సరానికి 353 శాతం వృద్ధి అని, ఈ జోరు FY24లో కూడా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము ఈ సంవత్సరం మా రిటైల్ ఔట్‌లెట్లను నాలుగురెట్లు పెంచామని, 30 స్టోర్‌ల నుండి ఇప్పుడు 116కి విస్తరించామని వివరించారు.
911పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు
Electric Vehicles (EV) లను వేగంగా స్వీకరించడం కోసం, Ather కంపెనీ ఈ ఏడాది అదనంగా 911 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్(Charging Points) లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,224 గ్రిడ్‌లను కలిగి ఉంది ఇది ద్విచక్ర వాహనాల కోసం భారతదేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌గా అవతరించింది. మారింది. గత నెలలో తాము చెన్నైలోని 10 MRTS, సబర్బన్ స్టేషన్‌లలో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి దక్షిణ రైల్వేలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రవ్‌నీత్ సింగ్ తెలిపారు.