Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. జనవరి 2020లో ప్రారంభించినప్పటి నుండి చేతక్ స్కూటర్ అత్యధికంగా అమ్ముడైన EV కావడం ఇదే మొదటిసారి.
ఏడాది చివరి నెల మొదటి పక్షం రోజులు పూర్తయ్యాయి. డిసెంబర్ 1-14, 2024 మధ్య 34,770 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Scooter) రిటైల్ అమ్మకాలు నమోదయ్యాయి. పండుగ సమయాల్లో అక్టోబర్, నవంబర్‌ల ఏకంగా 119,314 యూనిట్లలో 139,973 యూనిట్లు అమ్ముడయ్యాయి. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసేవారు సాధారణంగా డిసెంబరు నెలను వాయిదా వేసి జనవరిలోనే కొనేందుకు ఆసక్తి చూపుతారు.
డిసెంబర్ 2024 మొదటి అర్ధభాగంలో మార్కెట్ వాటా పరంగా, బజాజ్ ఆటో (Bajaj chetak Electric Scooter ) 27%, TVS 22%, ఓలా 18%, ఏథర్ 14% అలాగే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 4 శాతం ఉన్నాయి. తాజా వాహన్ డేటా (డిసెంబర్ 15, ఉదయం 7 గంటలకు), బజాజ్ ఆటో నుంచి వచ్చిన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ డిసెంబర్ మొదటి వారంలో 4,988 యూనిట్లతో టూ వీల్స్‌లో అత్యధికంగా అమ్ముడైన EVగానిలిచింది. వరుసగా రెండో వారంకూడా ఇదే పంథాను కొసాగించింది. చేతక్ డిసెంబర్ 1 మరియు 14 మధ్య మొత్తం రిటైల్ అమ్మకాలను 9,513 యూనిట్లు చేసింది. ఇది TVS iQube (7,567 యూనిట్లు) కంటే 1,946 యూనిట్లు ఓలా ఎలక్ట్రిక్ (6,387 యూనిట్లు) కంటే 3,126 యూనిట్లు ఎక్కువ. నాల్గవ స్థానంలో ఉన్న ఏథర్ ఎనర్జీ 5,053 యూనిట్లను విక్రయించగా, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 1,378 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
డిసెంబర్ 2024 మొదటి అర్ధభాగంలో మార్కెట్ వాటా పరంగా, బజాజ్ ఆటో (Bajaj Auto Sales ) 27%, TVS 22%, Ola 18%, Ather 14% మరియు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 4% కలిగి ఉన్నాయి. ఈ ఐదు OEMలు కలిపి 85% ఖాతాని కలిగి ఉన్నాయి, EV పరిశ్రమలోని ఈ విభాగంలోని 209 ఇతర కంపెనీలు మిగిలిన 15% వాటాను కలిగి ఉన్నాయి. డిసెంబర్ చివరి రెండు వారాల్లో బజాజ్ చేతక్ అదే వృద్ధి కొనసాగిస్తే, ఈ నెలలో చేతక్ జనవరి 2020లో ప్రారంభించిన తర్వాత భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా అవతరిస్తుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..