Bajaj Chetak electric scooter ఇప్పుడు దేశంలోని 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఢిల్లీ, గోవా, ముంబైతో సహా 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని గురువారం ప్రకటించింది. 2022 మొదటి ఆరు వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయగలిగామని కంపెనీ పేర్కొంది.
బజాజ్ ఆటో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుక్ చేసుకున్న వినియోగదారులు ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఆసక్తి గల కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
బజాజ్ కంపెనీ 2022లో చేతక్ నెట్‌వర్క్‌కు 12 కొత్త నగరాలను జోడించింది. అందులో విశాఖపట్నం, కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై మరియు మపుసాతో సహా నగరాలకు విస్తరించారు.
రూ.300కోట్ల పెట్టుబడి
బజాజ్ ఆటో తన Bajaj Chetak electric scooter వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవడానికి రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. “చేతక్ విజయం పూర్తిగా పరీక్షించబడిన, నమ్మదగిన వాహనమని తెలిపారు. అధిక డిమాండ్‌కు తగ్గట్టుగా రాబోయే కొద్ది వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
75కి.మి వేగం, 95 కి.మి రేంజ్
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అర్బేన్, ప్రీమియం అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. చేతక్ ట్రిమ్‌లు రెండూ ఒకే 3.8kW మోటారు నుంచి శక్తిని పొందుతాయి కాబట్టి అవి యాంత్రికంగా ఒకే విధంగా ఉంటాయి. ఇందులో నాన్-రిమూవబుల్ 3kWh IP67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. అయితే ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువ భాగం ఇప్పుడు స్వాప్ చేయగల/ డిటాచబుల్ బ్యాటరీని వినియోగిస్తున్నారు. చేతక్ ఇంకా ఈ సాంకేతికతతో ముందుకు రాకపోవడం ఇక్కడ లోపకంగా చెప్పవచ్చు. ఇక Bajaj Chetak స్కూటర్ గరిష్టంగా 70kmph వేగంతో దూసుకెళ్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 95km (ఎకో మోడ్‌లో) రేంజ్‌ని ఇస్తుంది.
బజాజ్ చేతక్ ప్రధానంగా ఇండిగో మెటాలిక్, వెలుట్టో రోస్సో, బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్‌నట్ వంటి రంగులలో అందుబాటులో ఉంది.
Bajaj Chetak Specifications
- Motor Power 4080 W
- Motor Type
- BLDC
- Charging Time 5 Hours
- Max Torque 16 Nm
- Range 95 km/chargeRange
- (Eco Mode)95 km/chargeRange
- (Sport Mode)85 km/charge
- Starting Remote Start, Push Button Start
- Transmission Automatic
- Reverse Gear Yes
- Battery Warranty 3 Years / 50000 km
- Battery Type Lithium Ion
- Battery Capacity 48 V, 60.3 Ah
- Low Battery Indicator Yes
- Battery Ip Rating 67
- Motor IP Rating 67
- Tyre Size Front :-90/90-12
- Rear :-90/100-12
- Tyre Type Tubeless
- Wheel Size Front/ Rear : 304.8 mm
- Wheels Type Alloy
- Front Brake Disc
- Rear Brake Drum
👌👌👌
Amazing
[…] మరో 20 నగరాల్లో Bajaj Chetak electric scooter […]
[…] మరో 20 నగరాల్లో Bajaj Chetak electric scooter […]