Most affordable Bajaj Chetak

Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

Spread the love

Bajaj Chetak Urbane Electric Scooter : దేశీయ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చేతక్ అర్బేన్ అనే కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్  వేరియంట్  రూ. 1.15 లక్షలు ఉండగా. ఎక్ట్రా ఫీచర్లు, అధిక పనితీరు కలిగిన మరో వేరియంట్ “టెక్పాక్” ధర రూ. 1.21 లక్షలుగా ఉంది.

భారత మార్కెట్లో  బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు భారీగానే ఉంటోంది. ఈ స్కూటర్‌ను 2020లో మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లలో ప్రారంభించింది. కానీ అర్బన్‌ వేరియంట్‌ విక్రయాలను బజాజ్ నిలిపివేయగా.. ప్రస్తుతం ప్రీమియం, అలాగే ప్రీమియం ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.  అయితే బజాజ్‌ నుంచి అర్బన్‌ వేరియంట్‌ను మళ్లీ తీసుకువస్తోంది.

రెండు వేరియట్లలో..

చేతక్ అర్బన్ (Chetak Urbane Scooter) స్కూటర్ త్వరలో చిన్న బ్యాటరీ ఆప్షన్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  దీని ద్వారా బజాజ్ స్కూటర్‌ ధర తగ్గే అవకాశముంది. కొత్త బ్యాటరీ ఆప్షన్‌ కోసం ఆమోదం కోరుతూ ప్రభుత్వానికి బజాజ్‌ ఆటో దరఖాస్తు చేసుకుంది.  ప్రభుత్వ వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.  ఆ సమాచారం ప్రకారం.. కొత్త చేతక్‌ అర్బన్‌  ఈవీ బ్యాటరీ ప్యాక్‌, ఫీచర్లు డిజైన్ విషయానికొస్తే… ఈ స్కూటర్‌ 2.48kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. కాగా చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 2.88kWh బ్యాటరీతో నడుస్తుంది.

కొత్త చేతక్‌ అర్బన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ పరిమాణం తగ్గడం వల్ల రేంజ్‌ కూడా తగ్గుతుంది.  ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రేంజ్‌ 113 కిలోమీటర్లని  సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చేతక్ ప్రీమియం స్కూటర్ 126 కిలోమీటర్ల మేర రేంజ్‌ను ఇస్తుంది. అయితే పొడవు, వెడల్పు, ఎత్తుతో సహా కొలతల్లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే లుక్స్‌ పరంగా ప్రస్తుత చేతక్ ప్రీమియం స్కూటర్, కొత్త అర్బన్ స్కూటర్లలో ఎలాంటి తేడా కనిపించదు.

ధర ఎంత ఉండొచ్చు..?

కొత్త బజాజ్‌ చేతక్‌ అర్బన్ వేరియంట్ బరువును పరిశీలిస్తే ప్రీమియం వేరియంట్ కంటే 3 కిలోల వరకు తేలికగా ఉంటుందని తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం, మిడ్-మౌంటెడ్ మోటార్‌తో కూడిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పబ్లిక్ రోడ్‌పై ఇటీవలే టెస్ట్‌ రైడింగ్ చేశారు. కాగా ఇది చేతక్ అర్బన్ స్కూటర్ అయ్యే చాన్స్ ఉంది. కాగా భారత మార్కెట్ లో  అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.50 లక్షలు గా ఉంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో సెటాక్ యొక్క కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియంట్‌ రూ.1 లక్ష నుండి రూ.1.20 లక్షలకు తగ్గించే చాన్స్ ఉంది.

 

More From Author

Ather 450 Apex

Ather 450 Apex | వేగవంతమైన.. పవర్ ఫుల్.. ఏథర్ కొత్త స్కూటర్ వస్తోంది…

Top 10 electric scooters

Top 10 electric scooters: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

One thought on “Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *