Saturday, June 29Save Earth to Save Life.

CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

Spread the love

Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు వాయిదా వేసింది.

బ్రూజర్ ( Bajaj Bruzer ) అని పిలవబడే ఈ CNG మోటార్‌సైకిల్ 110-150 cc సెగ్మెంట్‌లో ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ వాహనాన్ని పలు ప్రాంతాల్లో పరీక్షలు చేస్తోంది.  CNG పవర్డ్ మోటార్‌సైకిల్ ఇంధన ఖర్చులను 65 శాతం వరకు తగ్గిస్తుందని  తెలుస్తోంది.

సీఎన్జీ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికనప్పటికీ , టెస్ట్ మ్యూల్స్ చిత్రాలను బట్టి చూస్తే..  అది మోటార్‌సైకిల్ పొడవున ఉన్న CNG ట్యాంక్‌తో డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.  డిజైన్ పరంగా, టెస్ట్ మ్యూల్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, హాలోజన్ టర్నింగ్ ఇండికేటర్లు, మువదువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ అబ్జావర్బర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే డిస్క్ బ్రేక్ ను ఇందులో చూడవచ్చు. ,  వంటి కొన్ని సాధారణ కమ్యూటర్ మోటార్‌సైకిల్ డిజైన్ అంశాలు ఉన్నాయి. అయితే ఇది ప్రత్యేకంగా సాధారణ సింగిల్-పీస్ సీటు కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంది.

కొత్త సీఎన్జీ బైక్ కు బజాజ్ బ్రూజర్,  గ్లైడర్, మారథాన్, ట్రెక్కర్ లేదా ఫ్రీడం పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.  జూలై 5 నాటికి పూర్తి వివరాలు తెలుస్తాయి.  ప్రస్తుత పెట్రోల్ బైక్ లతో పోల్చితే సీఎన్జీ బైక్ చాలా ఫ్యూయల్ ను ఆదా చేస్తుంది. ఎలక్రిక్ వాహనాలకు పెట్రోల్ వాహనాలకు ఇది వారధిగా ఉండనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇందులో కంపెనీలన్నీ స్కూటర్లనే ఎక్కువగా తీసుకొస్తున్నాయి. అయితే సీఎన్జీ బైక్ వస్తే  ఈ పరిస్థితిలో మార్పు కనిపించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో పాటు, పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది.  (Bajaj CNG Bike Launch Date) జూలై 5న బజాజ్ సీఎన్జీ మోటర్ సైకిల్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..