వరంగల్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ప్రారంభించిన ఒక అద్భుతమైన సుదీర్ఘ మోటార్ సైకిల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. వరంగల్‌కు చెందిన రైడర్ కిశోర్ కుమార్ అడెపు (Kishore Kumar Adepu) లక్షసాధన కోసం దేశంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ (CNG) మోటార్ సైకిల్ అయిన ‘Bajaj Freedom 125 CNG ను ఎంచుకున్నాడు. ఈ సీఎన్‌జీ బైక్‌పై కేవలం 58 రోజుల్లో 13,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సరికొత్త మైలురాయిని సృష్టించారు.
మే 4, 2026న తెలంగాణలోని వరంగల్ జిల్లా నుండి ప్రారంభమైన ఈ యాత్రలో విభిన్నమైన యాత్రలో నేతాజీ గొప్పతనాన్ని ఎంతో మంది యువకులకు, పిల్లలకు వివరించారు. అయితే ఆయన ప్రయాణించిన బజాజ్ ఫ్రీడమ్ బైక్ భారతదేశంలోని భౌగోళిక, సంస్కృతిక వైవిధ్యాన్ని అన్వేషించడంతో పాటు, మైలేజ్, రోజువారీ అవసరాల కోసం డిజైన్ చేసిన ఒక సాధారణ CNG బైక్.. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా, సుదూర ప్రయాణాలనైనా తట్టుకోగలదని నిరూపించింది.
వరంగల్ టు లడఖ్: సాగిన మార్గం ఇదే!
దక్షిణ భారత తీరప్రాంతాల నుండి హిమాలయాల అంచులలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల వరకు కిషోర్ ప్రయాణం సాగింది. ఆయన ప్రయాణించిన రూట్ మ్యాప్:
వరంగల్ (తెలంగాణ) ➔ ఆంధ్రప్రదేశ్ ➔ చెన్నై ➔ పుదుచ్చేరి ➔ తమిళనాడు ➔ కన్యాకుమారి ➔ కేరళ ➔ కర్ణాటక ➔ NH44 కారిడార్ ➔ మహారాష్ట్ర ➔ మధ్యప్రదేశ్ ➔ రాజస్థాన్ (జైపూర్) ➔ ఉత్తరప్రదేశ్ (ఆగ్రా) ➔ హర్యానా ➔ పంజాబ్ (అటారీ బోర్డర్) ➔ జమ్మూ ➔ శ్రీనగర్ ➔ తాంగ్ లాంగ్ లా ➔ బారాలాచా లా ➔ లడఖ్ ➔ మనాలి ➔ మీరట్ ➔ కన్నౌజ్ ➔ ఢిల్లీ ➔ లక్నో ➔ బీహార్ ➔ జార్ఖండ్ ➔ కోల్‌కతా ➔ భువనేశ్వర్
➔ రాయ్‌పూర్ మీదుగా మళ్లీ తెలంగాణ.
భారతదేశం చివరి సరిహద్దు అయిన పంజాబ్‌లోని అటారీ-వాఘా బోర్డర్ నుండి హిమాలయాల్లోని అత్యంత ప్రమాదకరమైన తాంగ్ లాంగ్ లా, బారాలాచా లా వంటి కనుమలను (Mountain Passes) ఈ చిన్న 125cc CNG బైక్ పై విజయవంతంగా దాటడం విశేషం.
ఈ యాత్ర యొక్క ముఖ్య విశేషాలు (Expedition Highlights)
మన్నికకు నిదర్శనం: కేవలం 58 రోజుల్లో 13,000+ కిలోమీటర్ల ప్రయాణం ద్వారా, తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ హిత వాహనాలు కూడా సుదూర ప్రయాణాలకు (Long-distance Touring) పూర్తి అనుకూలమని నిరూపితమైంది.
హిమాలయాల విజయం: మైనస్ డిగ్రీల చలి, ఆక్సిజన్ తక్కువగా ఉండే లడఖ్, జమ్మూ కాశ్మీర్ పర్వత ప్రాంతాలను బజాజ్ ఫ్రీడమ్ 125 CNG ఎలాంటి ఆటంకాలు లేకుండా అధిగమించింది.
హరిత పర్యాటకానికి కొత్త దిక్సూచి!
సాధారణంగా CNG వాహనాలను కేవలం నగరాలకే పరిమితమైన బడ్జెట్ వాహనాలుగా చూస్తారు. కానీ కిషోర్ కుమార్ చేసిన ఈ సాహసోపేత యాత్ర ఆ అంచనాలను పూర్తిగా మార్చేసింది. విభిన్న వాతావరణ పరిస్థితులు, ఎత్తైన ఘాట్ రోడ్లు, సుదీర్ఘమైన హైవేలపై ఈ బైక్ చూపిన పర్ఫార్మెన్స్ భవిష్యత్తులో ‘గ్రీన్ టూరిజం’ (Eco-friendly Tourism) కి పెద్ద పీట వేయవచ్చని చాటిచెప్పింది. తక్కువ ఖర్చుతో, తక్కువ కార్బన్ ఉద్గారాలతో (Carbon Footprint) దేశాన్ని చుట్టిరావచ్చని ఈ యాత్ర ద్వారా స్పష్టమైంది.
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానమే (Sustainability) ధ్యేయంగా పనిచేస్తున్న మన హరితమిత్ర వేదిక ద్వారా కిషోర్ కుమార్ సాధించిన ఈ విజయాన్ని పంచుకోవడం మాకు ఎంతో గర్వకారణం. పర్యావరణానికి హాని చేయకుండా కూడా అద్భుతమైన సాహసాలు చేయవచ్చని ఆయన నిరూపించారు.




