Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్యధికంగా రేటింగ్ పొందిన వాహనాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని అధిగమించింది.
79 kWh బ్యాటరీ ప్యాక్‌తో మహీంద్రా XEV 9e టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌ను Bharat NCAP పరీక్షించింది. అయితే, అదే రేటింగ్ 59 kWh వేరియంట్‌లకు కూడా వర్తిస్తుందని నివేదిక పేర్కొంది.
Mahindra XEV 9e స్కోర్
ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లు రెండింటిలోనూ, XEV 9e 16 పాయింట్లలో పూర్తి 16 స్కోర్ చేసింది. ఇది అడల్ట్రీ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో BNCAP ద్వారా పూర్తి 32/32 పాయింట్లను పొందిన మొదటి మోడల్‌గా నిలిచింది. డ్రైవర్ తోపాటు ముందు కూర్చేనేవారి ప్రాంతాలు తల, ఛాతీ నుంచి పెల్విస్, కాళ్ళ వరకు ఇంపాక్ట్ పాయింట్‌లలో బెస్ట్ రేటింగ్ ఇచ్చింది .XEV 9eకి సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో మంచి రేటింగ్ ఇచ్చింది
ఇక చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో, మహీంద్రా XEV 9e డైనమిక్ టెస్ట్‌లో Bharat NCAP 24/24, CRS ఇన్‌స్టాలేషన్ అసెస్‌మెంట్‌లో 12/12 మరియు వెహికల్ అసెస్‌మెంట్‌లో 9/13 స్కోర్ చేసింది, 49 పాయింట్లలో 45 పాయింట్లను స్కోర్ చేసింది. 18 నెలల, 3 ఏళ్ల చైల్డ్ డమ్మీ బొమ్మలతో వెనుకవైపు ఉన్న పిల్లల సీట్లలో ఉంచి పరీక్షించారు.
మహింద్రా XEV 9e భద్రత ఫీచర్లు..
ఎంట్రీ-లెవల్ ప్యాక్ వన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX యాంకర్లు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, వెనుక కెమెరా, టైర్ ప్రెజర్ మానిటర్, డ్రైవర్ డ్రస్‌నెస్ డిటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆటో హెడ్‌లైట్లు వైపర్‌లు ఉన్నాయి, టాప్-స్పెక్‌లో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ కిట్ లభిస్తుంది. , స్వీయ-పార్కింగ్‌ను కలిగి ఉన్న లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సూట్ ఫంక్షన్, 360-డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటివి ఇందులో చూడవచ్చు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..