
Electric Vehicle Park : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ ఎంఓయూపై సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని విశ్వప్రసాద్ అన్నారు. ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ దేశంలోని ప్రైవేట్ EV పార్కుల కోసం బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. ఈ ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆవిష్కరణ, ఉపాధికి అవకాశాలను సృష్టిస్తుంది. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపార ప్రణాళికలతో వేగంగా దూసుకుపోతుందని, ప్రభుత్వం చురుకైన విధానాన్ని మేము అభినందిస్తున్నామని ఆయన అన్నారు.
25వేల మందికి ఉపాధి
ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ మొత్తం రూ. 1,800 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ అనుబంధ పరిశ్రమలకు అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పార్క్ పూర్తిగా కార్యరూపం దాల్చితే, 1.5 బిలియన్ డాలర్ల (రూ. 3,000 కోట్లు) పెట్టుబడిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. పార్క్ యాంకర్ యూనిట్‌గా, పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..