City Transformer | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కంపెనీలు విభిన్నమైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మడిచేసుకోవడానికి వీలుగా ఉండే స్కూటర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అలాగే ఇజ్రాయెలీ స్టార్టప్ కంపెనీ కూడా ఏకంగా మడిచేసుకోవడానికి వీలయ్యే కారు (Foldable Electric Car ) ను మార్కెట్లో విడుదల చేసింది.
ఇజ్రాయెలీ(Israel) స్టార్టప్ కంపెనీ ‘సిటీ ట్రాన్స్ ఫార్మర్స్స మహా నగరాల్లో ప్రాంతాల్లోని ట్రాఫి క్ ను దృష్టిలో పెట్టుకుని ‘సీటీ-2’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఇందులోని ఫోల్డింగ్ మెకానిజం వల్ల ఈ కారు వీల్ బేస్ను పార్కింగ్ సమయంలో కుంచించుకునేలా చేయవచ్చు. ఇవి పార్కింగ్ ప్రదేశాల్లో తక్కువ వెడల్పు ఉన్న ప్రాంతంలోకి కూడా దూరిపోతాయి. ఇలా మడిచేస్తే, వీల్ బేస్ 4.6 అడుగుల నుంచి కేవలం 39 అంగుళాల వెడల్పుకు ముడుచుకుపోతుంది. ఈ సౌకర్యం వల్ల తక్కువ చోటులోనే ఈ కారును పార్క్ చేసుకోవడం, పార్కింగ్ ప్రదేశం నుంచి బయటకు తీసుకురావడం చాలా సులువుగా ఉంటుంది.
City Transformer ముడుచుకున్న స్థితిలో ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 40 కిలోమీటర్లు. దీనిని పూర్తిగా 4.6 అడుగుల వెడల్పుకు విస్తరించినట్లయితే, ఇది గంటకు 90. కిలోమీటర్ల గరిష్టవేగంతో పరుగులు తీస్తుంది. వాహనంలో డ్రైవర్ తోపాటు మరొరు కూర్చోవడానికి సీటు ఉంది. ఇక దీన్ని ఒక్క సారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 100-150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది కారు డ్రైవర్‌కు సులభంగా పార్కింగ్ చేయడంలో ట్రాఫిక్‌లో వేగంగా దూసుకుపోతుంది. ఈ ఏడాది జూలై నాటికి ఈ కారు మార్కెట్లోకి విడుదల కానుంది, . దీని ధర 17,400 డాలర్లు (రూ.14.43 లక్షలు). దీనిని 160 డాలర్లు (రూ.13,272) ముందుగా చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
This is the City Transformer single-seat microcar. Doesn’t have pedal-assist. Width can be reduced to fit in narrow lanes.
Much lighter version of same concept can let quad recumbent cycles or cargo trikes fit through narrow modal filtershttps://t.co/dzIoZ9Lv2z pic.twitter.com/qnqYDSd1MY
— Off-Grid Tech (@OffGridTech_net) March 5, 2024
Avenairs Textus| ఈ వినూత్నమై ఎలక్ట్రిక్ వాహనం చూశారా? దీని ప్రత్యేకతలు చూస్తే..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.