పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలిగించేలా పాఠ్యప్రణాళిక
కాలుష్య నివారణ, నీటిపొదుపు, సౌరశక్తి వినియోగం ఇలా మరెన్నో ప్రత్యేకతలు
Climate Resilient School: పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా, పర్యావరణవేత్తలుగా తీర్చిదిద్దేందుకు డెట్టాల్ (Dettol) కంపెనీ దేశంలోని మొట్టమొదటి క్లైమేట్ రెసిలెంట్ స్కూల్ ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో ప్రారంభించింది.
ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ గురించి రెకిట్, SOA, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ & పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ రవి భట్నాగర్ ఇలా అన్నారు.. ‘మేము ఉత్తరాఖండ్ లో క్లైమేట్ రెసిలెంట్ పాఠశాలల (Climate Resilient School) భావనను తీసుకొచ్చాము. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించిన మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ కింద.. వాతావరణ మార్పులపై పోరాడేందుకు పాఠశాలల్లో పిల్లల క్యాబినెట్‌లను కలిగి ఉండాలనే భావనను తీసుకొస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరింత మంది వ్యక్తులు, సంఘాలు మాతో చేరతారని ఆశిస్తున్నాము.’ అని తెలిపారు.
వాతావరణాన్ని తట్టుకునే పాఠశాలలు అంటే ఏమిటి?
క్లైమేట్ రెసిలెంట్ మోడల్ స్కూల్.. స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా ఎన్విరాన్ మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీని చేయడంపై దృష్టి పెడుతుంది. పాఠశాల మౌలిక సదుపాయాలు, ఎనర్జీ, స్వచ్ఛమైన నీటి వినియోగం వంటివి ఉంటాయి.
ప్రత్యేకతలు ఇవీ..
- రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ (వర్షపు నీటి యాజమాన్యం)
- గ్రే వాటర్ రీసైక్లింగ్
- ఫుట్ ఆపరేట్/డ్రిప్ హ్యాండ్-వాషింగ్ స్టేషన్లు
- సౌరశక్తి నుంచి నిరంతర విద్యుత్ తయారీ, సరఫరా
- ప్రామాణిక నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులలో లైటింగ్ ఏర్పాటు
- వాతావరణానికి అనుకూలంగా ఉష్ణోగ్రతలు ఉండేలా భవనాలు నిర్మించడం
- వ్యర్థాల విభజన, నిర్వహణ – జీరో వేస్ట్ క్యాంపస్‌ను సృష్టించడం
- బయో-యూరినల్స్
- పాఠశాల ఆవరణలో పచ్చదనం
- వాతావరణానికి అనుకూలమైన స్కూల్ బ్యాగ్, పెన్సిల్, పెన్, పెన్సిల్ బాక్స్, ఇతర వినియోగ వస్తువులు
- జీరో ప్లాస్టిక్ జోన్
- గ్రీన్ బిల్డింగ్ లేదా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ ఏజెన్సీల ద్వారా క్లైమేట్ రెసిలెంట్ స్కూల్స్ – జీరో కార్బన్ సర్టిఫికేషన్
ఈ ప్రాజెక్ట్ మొదట మూడు దశల్లో అమలు చేయనున్నారు. 2023 నుండి 2025 వరకు ఇది అమలు చేయబడుతుంది. ఇది ఉత్తరాఖండ్‌లోని మొత్తం 13 జిల్లాలను కవర్ చేస్తుంది. 13 జిల్లాల దశల వారీ కవరేజీ ఇలా ఉంది.
మొదటి సంవత్సరం – 3 జిల్లాలు: ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ & చమోలి
రెండో సంవత్సరం – 4 జిల్లాలు: చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్
మూడో సంవత్సరం – 6 జిల్లాలు: పితోరాఘర్, బాగేశ్వర్, అల్మోరా, నైనిటాల్, తెహ్రీ & పౌర్
డెట్టాల్ ప్రారంభించిన క్లైమేట్ రెసిలెంట్ స్కూల్స్ గురించి ప్లాన్ ఇండియా స్టేట్ అడ్వకేసీ ప్రోగ్రామ్ మేనేజర్ షారన్ జాకబ్ వివరిస్తూ.. క్లైమేట్ రెసిలెంట్ స్కూల్స్ క్యాంపస్, కరికులం, కోలాబరేషన్ అనే మూడు అంశాలపై దృష్టి పెడతాయి. క్యాంపస్‌లో మేము ఐదు థ్రస్ట్ ప్రాంతాలను కవర్ చేస్తాము – గాలి, జీవ వైవిధ్యం, నీరు, వ్యర్థాలు, ఎనర్జీ. మా వద్ద సౌర శక్తి ప్యానెల్లు ఉన్నాయి, తద్వారా పాఠశాల సమర్థవంతమైన శక్తి వనరుతో నడుస్తుంది. పాఠశాలల్లో నీటిని సంరక్షించేందుకు పరిమిత నీటిని మాత్రమే అనుమతించే తక్కువ నీరు ప్రవహించే ఫిక్చర్ ట్యాప్‌లు కూడా మా వద్ద ఉన్నాయి. మేము మా చెత్తను పొడి, తడి చెత్తగా విభజించి, కంపోస్టింగ్ గురించి విద్యార్థులకు బోధిస్తున్నాము.
క్యాంపస్ సంబంధిత మార్పులే కాకుండా, క్లైమేట్ రెసిలెంట్ స్కూల్‌లు నిర్దిష్ట వాతావరణ పాఠ్యాంశాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి అనుభవపూర్వక, సందర్భోచిత అభ్యాస విధానంతో వాతావరణ మార్పు గురించి పిల్లలకు బోధిస్తాయి. ప్రాజెక్ట్‌లో భాగంగా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి.. ఫెసిలిటేటర్‌లుగా శిక్షణ ఇస్తారు. పిల్లలు ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం, మారుతున్న వాతావరణ నమూనాల గురించి తెలుసుకోవడానికి STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) సాధనాల గురించి అవగాహన కల్పిస్తుంది.
ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ రుహేలా మాట్లాడుతూ… క్లైమేట్ రెసిలెంట్ స్కూల్స్ మొత్తం కార్బన్ శాతాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వాతావరణాన్ని తట్టుకునే పాఠశాలల్లో చదివే విద్యార్థులు సమాజంలో వాతావరణ మార్పుల గురించి ప్రచారం, అవగాహన కల్పించడానికి సహాయపడతారు అని తెలిపారు. కాగా ఇలాంటి గొప్ప పాఠశాలల రూపకల్పన అనేది.. ప్రధాని మోదీ అద్భుతమైన ఆలోచన.. ఈ పాఠశాలలను తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడి పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి