Harithamithra Telugu News

Home General News Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

0
Solar Energy

Solar Energy | సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ రంగం (Renewable Energy)పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు వెల్ల‌లించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతం చేసేందుకు సోలార్‌ విద్యుదుత్పత్తితోపాటు, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని అన్నారు.
రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వాటి లబ్ధిదారులకు సోలార్‌ విద్యుత్‌ అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతినెలా కచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని వివ‌రించారు. జర్మన్‌ ప్రతినిధులు సూచించిన సోలార్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని (Solar Technology) రాష్ట్రంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోగలం, తెలంగాణ విద్యుత్‌ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్‌ బృందం ప్రతిపాదనలు ఏ మేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ను ఆదేశించారు. SPDCL,
సమావేశంలో ట్రాన్స్‌కో (Transco) సీఎం డి.కృష్ణ భాస్కర్‌, ఎస్పీడీసీఎల్‌ (NPDCL) సీఎండి ముషారఫ్‌ ఫారుఖి, రెడ్కో (REDCO) సీఎండీ అనిలా, జర్మన్‌ ప్రతినిధులు డాక్టర్‌ సెబాస్టియన్‌, డాక్టర్‌ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.

 Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం  X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleSolar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
Next articleSolar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here