CNG two-wheeler

CNG two-wheeler | త్వరలో TVS నుంచి సీఎన్జీ స్కూటర్.. జూపిటర్ స్కూటర్ ఇక సీఎన్జీ వేరియంట్ లో..

Spread the love

CNG two-wheeler | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ అయిన బ‌జాజ్‌ ఫ్రీడమ్ 125 ని గత వారం విడుదల చేసిన విష‌యం తెలుసిందే.. ఇంకా ఇది మార్కెట్‌లో అమ్మ‌కానికి రాలేదు. అయిన‌ప్ప‌టికీ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పై ఇప్పటికే భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ లో అలాగే ఇంటర్నెట్‌లో సంచ‌న‌లం రేపుతోంది. బైక్ డిజైన్‌, మైలేజీ విష‌యంలో అంద‌రూ మెచ్చుకుంటున్నారు. ఇది భారతదేశంలోని ఇతర ద్విచక్ర వాహన కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచింది. ఇదిలా ఉండ‌గా దేశంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టీవీస్ మోటార్ కంపెనీ కూడా సీఎన్‌జీ ద్విచ‌క్ర‌వాహనాన్ని తీసుకురావాల‌ని చూస్తోంది.

TVS CNG 125cc స్కూటర్

ఇటీవలి ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. TVS CNGతో నడిచే జూపిటర్ 125పై పని చేస్తోంది. ఇది ఫ్యాక్టరీలో అమర్చిన CNG కిట్‌తో వచ్చే ప్రపంచంలోనే మొదటి స్కూటర్‌గా అవ‌త‌రించ‌నుంది. TVS కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై పనిచేస్తోందని. ఇప్పటికే CNG ఇంజ‌న్‌ను అభివృద్ధి చేసిందని నివేదికలు చెబుతున్నాయి.

125cc CNG స్కూటర్‌తో కూడిన U740 కోడ్‌నేమ్ ప్రాజెక్ట్ ఇప్పటికే రూపుదిద్దుకోవడం ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ స్కూటర్ 2024 చివరి నాటికి విడుద‌ల చేయ‌నుంది. లేదా 2025 ప్రథమార్థం తర్వాత మార్కెట్ లోకి తీసుకురానుంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. TVS నెలకు సుమారు 1,000 యూనిట్ల CNG స్కూటర్‌లను విక్రయించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

TVS CNG two-wheeler కు సంబంధించిన‌ వివరాలు ఇప్పటికే కొన్ని వెలుగులోకి వ‌చ్చాయి. అయితే దాని రూపాన్ని బట్టి, TVS తన కాబోయే కొనుగోలుదారులకు పెట్రోల్, ఫుల్‌-ఎలక్ట్రిక్, CNG-శక్తితో కూడిన స్కూటర్‌లతో సహా పలు వేరియంట్ల‌ను అందించాలని భావిస్తోంది. TVS ప్రస్తుతం 18% మార్కెట్ వాటాతో మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహన OEM గా, భారతదేశంలో రెండో అతిపెద్ద స్కూటర్ తయారీదారుగా ఉంది.

కాగా బ‌జాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125) బైక్ మాదిరిగా జూపిటర్ 125 CNG ఒక CNG సిలిండ‌ర్‌, సంప్రదాయ పెట్రోల్ ట్యాంక్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే, టీవీఎస్ స్కూటర్ బాడీలో CNG ట్యాంక్‌ను ఎలా ప్యాక్ చేస్తుందోన‌నే అంశం ఆసక్తికరంగా మారింది. ఇదే అతిపెద్ద సవాలుగా ఉండ‌నుంది. బ‌జాజ్ సీఎన్‌జీ బైక్ రూ. 95,000 నుంచి రూ. 1.10 లక్షల మధ్య ధర (ఎక్స్-షోరూమ్) వ‌ద్ద విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.. ఈ బైక్ లో 2 కిలోల సిఎన్‌జి ట్యాంక్‌తో కిలోకి 102 కిమీల సిఎన్‌జి మైలేజీని అందిస్తుంది. జూపిటర్ 125 ఇదే విధమైన ధ‌ర‌లో అందుబాటులోకి వ‌స్తుందని భావిస్తున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

Electric Vehicle Park

EV charge points | ఈవీ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లకు త్వరలో సింగిల్ విండో క్లియరెన్స్.. సమయం శ్రమ ఆదా..

EV Sales

EV News | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో ఓలాకు గట్టి పోటీనిస్తున్న బజాజ్, టీవీఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించండి..

Rooftop Solar Maintenance Guide | మీరు మీ ఇంటి మీద సోలార్​ ప్యానెల్స్​ ను ఏర్పాటు చేసుకున్నారా? అయితే మీకు అభినందనలు! డబ్బు ఆదా చేయడం, పర్యావరణానికి మేలు చేయడం, కార్బన్ పాదముద్రను తగ్గించే దిశగా మీరు అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే.. కానీ చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే —సోలార్​...