Crayon Envy electric scooter

రూ.64వేల‌కే Crayon Envy electric scooter

Spread the love

160 కిమీ రేంజ్, స్పీడ్ 25కి.మి స్పీడ్‌

క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) తాజాగా Crayon Envy electric scooter ను ఇండియన్ మార్కెట్లో రూ.64,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

భారతదేశంలోని 100 కంటే ఎక్కువ రిటైల్ షోరూంల‌లో ఈ electric scooter అందుబాటులో ఉంది. క్రేయాన్ ఎన్వీ ఇ-స్కూటర్ దాని కంట్రోలర్, మోటారుపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇ-స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, జియో ట్యాగింగ్, కీలెస్ స్టార్ట్, మొబైల్ ఛార్జింగ్, సెంట్రల్ లాకింగ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా Crayon Envy electric scooter రివర్స్ అసిస్ట్ ఆప్షన్ లభిస్తుంది. ఇది వాహనాన్ని సౌకర్యవంతంగా పార్క్ చేయడానికి సహాయపడుతుంది.

Crayon కంపెనీ పేర్కొన్న‌దాని ప్రకారం Envy electric scooter ప్రత్యేకంగా దాని డ్యూయల్ హెడ్‌లైట్లు & ల‌య‌న్ లాంటి బిల్ట్’తో ప్రకృతి నుండి ప్రేరణ పొందేందుకు రూపొందించబడింది. సింగిల్-సీట్ లాంగ్ రైడ్‌కు సహ‌క‌రిస్తుంది. ఇ-స్కూటర్ తెలుపు, నీలం, నలుపు సిల్వ‌ర్ రంగుల్లో అందుబాటులో ఉంది.

 

క్రేయాన్ ఎన్వీ స్కూట‌ర్‌లో 250-వాట్ BLDC మోటారు ను వినియోగించారు. దీనికి డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు, విశాలమైన బూట్ స్పేస్, 150ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. క్రేయాన్ మోటార్స్ ప్రకారం ఇ-స్కూటర్ 160 కిమీ/ఛార్జ్ పరిధిని, 25 కిమీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది.

 

లాంచ్ ఈవెంట్‌లో క్రేయాన్ మోటార్స్ కోఫౌండర్, డైరెక్టర్ మయాంక్ జైన్ మాట్లాడుతూ “ ఈ పర్యావరణ అనుకూల బైక్‌లను మా అంతర్గత పరిశోధన, అభివృద్ధి బృందం రూపొందించింద‌ని తెలిపారు. ఈ స్కూట‌ర్లు మా బ్రాండ్ యొక్క ఉత్తమ EV మొబిలిటీ సొల్యూషన్‌లుకు స‌హ‌క‌రించాల‌నే లక్ష్యానికి నిదర్శనమ‌ని తెలిపారు.

క్రేయాన్ ఎన్వీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు వివిధ ప్రాంతాలలో మారవచ్చు. కస్టమర్‌లకు కొనుగోలులో ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, షాప్‌సే, పేటైల్, మణప్పురం ఫైనాన్స్, జెస్ట్ మనీ వంటి ఫైనాన్సింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

For more videos visit :  Harithamithra

More From Author

komaki dt 3000 electric scooter

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter

ivoomi s1 electric scooter

130km Range.. 65kmph Top speed

One thought on “రూ.64వేల‌కే Crayon Envy electric scooter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *