దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్.. హీరో ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్‌లో కొత్తగా Hero Eddy electric 2-wheeler ను విడుదల చేసింది. దీని ధర రూ. 72,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుది.
Hero Electric చెందిన గత స్కూటర్ల కంటే భిన్నంగా ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఆధునిక ఫీచర్లు జోడించి దీనిని రూపొందించారు. Hero Eddy electric 2-wheeler లో ఇ-లాక్, ఫైండ్ మై బైక్, రివర్స్ మోడ్, పెద్ద బూట్ స్పేస్, ఫాలో మి హెడ్‌ల్యాంప్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ అవాంతరాలు లేని రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
అయితే ప్రస్తుతానికి ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేత నీలం, పసుపు అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.
Hero Eddy ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి ఎటువంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. Hero Eddy తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అంటే గరిష్ట వేగం 25 kmphకి పరిమితం చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. హీరో ఎడ్డీని తక్కువ దూర ప్రయాణాల కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. పొల్యూషన్ లేని ప్రైవేట్ లాస్ట్-మైల్ మొబిలిటీకి ఇది భవిష్యత్ స్టైలిష్ సొల్యూషన్ అని హీరో కంపెనీ పేర్కొంది.
స్మార్ట్ ఫీచర్‌లు, స్టైలిష్ లుక్‌లతో
Hero Eddy electric 2-wheeler లాంచ్‌పై హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజాల్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఫీచర్‌లు, స్టైలిష్ లుక్‌లతో కూడిన తమ రాబోయే electric two-wheeler హీరో ఎడ్డీని ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అవాంతరాలు లేని రైడ్ అనుభవంతో పాటు కార్బన్ రహిత భవిష్యత్తుకు సహకరించేందుకు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని స్కూటర్ రూపొందించబడిందని చెప్పారు.
దేశవ్యాప్తంగా 750 సర్వీస్ పాయింట్లు
హీరో ఎలక్ట్రిక్ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, లూథియానాలో తయారీ యూనిట్ ఉంది. కంపెనీ విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది. Hero Electric ప్రస్తుతం దేశవ్యాప్తంగా 750 కంటే ఎక్కువ సేల్స్ అండ్ సర్వీస్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. దీనితో పాటు విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్, శిక్షణ పొందిన రోడ్‌సైడ్ EV మెకానిక్‌లు ఉన్నారు. యి. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో 4.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కలిగి ఉంది.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.!
Nice 👍
Awesome