E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..

Spread the love

E20 Fuel Benefits | ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో మ‌న భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధ‌నాలను విచ్చ‌ల‌విడిగా వాడేస్తుండ‌డంతో కాలుష్యం పెరిగిపోయి ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తిని ఊహించ‌ని విప‌త్తులను మ‌నం చూస్తునే ఉన్నాం.. అయితే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నం, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను అన్వేషిస్తోంది. భార‌త్ 2030 నాటి తన పునరుత్పాదక ఇంధన మిషన్‌కు కట్టుబడి ఉంది. కొత్త‌గా ఇప్పుడు E20 పేరుతో కొత్త పర్యావరణ హిత‌మైన ఇంధ‌నంపై ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తోంది. క్ర‌మంగా పెట్రోల్ స్థానంలో E20 ఫ్యూయల్ ను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇది భారత ప్రభుత్వానికి చమురు దిగుమతులు పెరగకుండా ఉపశమనం కల్పిస్తుంది. కానీ దీని వల్ల వినియోగదారులకు లాభం ఏమిటీ ? ఇది మీ వాహనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కొత్తగా వెలుగులోకి వస్తున్న E20 ఇంధనం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు చూడండి..

E20 Petrol అంటే ఏమిటి?

1970లలో బ్రెజిల్‌లో మొట్టమొదటిసారిగా విస్తృతంగా ఉపయోగించారు. E20 ఇంధనం ఇథనాల్ , గ్యాసోలిన్ (పెట్రోల్/డీజిల్) ల సాధారణ మిశ్రమం. ఇందులో 20% ఇథనాల్, 80% గ్యాసోలిన్ కలిగి ఉంటుంది. ఇది కార్లు, ట్రక్కులు, స్కూటర్లు, బైక్‌ల వంటి వాహనాల్లో ఉపయోగిస్తారు. పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఇంధనాల వైపు వెళ్లడానికి E20 ఒక మంచి మార్గం. చెరకు తోపాటు మొక్కల గింజల అవశేషాల నుండి ఇథనాల్ సంగ్రహిస్తారు. తద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను తయారు చేయడం ద్వారా చెరకు సాగు, చక్కెర పరిశ్రమను బలోపేతం చేస్తుంది. ప్రత్యక్షంగా చెరుకు రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.

భారతదేశంలో 2030 నాటికి పూర్తిగా E20 ఇంధనాన్ని వినియోగించాలనే లక్ష్యంతో 2018 లో జాతీయ విధానాన్ని కేంద్రం రూపొందించింది. 2022 జూన్ వరకు 10 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. 2025-26లో 20 శాతం తుది లక్ష్యం చాలా ముందుగానే పూర్తవుతుందని అంచనా వేసింది.

భారత ప్రభుత్వం ప్రకారం, ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్ ఇథనాల్ తయారీ ప్రక్రియ) కార్యక్రమం ఫలితంగా రూ. 41,500 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. 27 లక్షల మెట్రిక్‌టన్‌ల GHG ఉద్గారాలను తగ్గించింది. రైతులకు రూ. 40,600 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది.

పెట్రోల్ / డీజిల్ కంటే E20 fuel ఎలా మంచిది?

E20 fuel benefits : గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలలో E20 ఇంధన మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు. అయితే సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కంటే E20 ఇంధనం వల్ల చాలా ప్రయోజనాలు కలిగాయని తేలింది.

పునరుత్పాదక శక్తి : ఇంధన మిశ్రమంలో భాగంగా ఇథనాల్‌ను ఉపయోగించడం ద్వారా, E20 పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచుతుంది. ఇది పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలపై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
మెరుగైన ఇంజిన్ పనితీరు: ఇథనాల్ ఆక్టేన్ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇది ఇంజన్ పనితీరును మెరుగుపరచడానికి, ఇంజిన్ నాక్‌ను తగ్గిస్తుంది. అయితే మెరుగైన ఇంజిన్ పనితీరు అనేది ఒక చర్చనీయాంశమైన అంశమని గమనించండి, ఎందుకంటే ఇది తయారీ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, E20 ఇంధనం సాధారణంగా కొత్త వాహనాలకు ప్రయోజనం చేకూరుస్తుందని గుర్తించారరు. అయితే ఇది పాత వాహనాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని చెబుతారు. .

E20 ఇంధనం పర్యావరణానికి మంచిదా?

  • ఇంతకు ముందు చెప్పినట్లు, E20 ఇంధనంలోని 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ఇది  చెరకు, మొక్కల గింజల నుండి సేకరించిన జీవ ఇంధనం. అందువల్ల, ఇది శిలాజ ఇంధనాలు, పెట్రోల్, డీజిల్ కంటే చాలా ఎక్కువ పునరుత్పాదకమైనది. ఇది మరింత స్థిరమైన ఇంధనం అనడంలో సందేహం లేదు. ప్రతిరోజూ మిలియన్ల లీటర్ల ఇంధనం మండుతుండగా, ఈ20 ఇంధనం ఎక్కువగా వినియోగంలోకి వస్తే.. పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుంది.
  • ఇథనాల్ లో ఆక్సిజన్ కంటెంట్‌  ఎక్కువగా ఉన్నందున, ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించే వాహనాల ఇంజిన్‌లు ఇంధనాన్ని మండించడం వల్ల  ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తాయి. అందువల్ల, ఈ ప్రక్రియ దేశంలో  కార్బన్ పాదముద్రను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది .
  • పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ఆటో ఇంధన దిగుమతి బిల్లు సంవత్సరానికి 4 బిలియన్ డాలర్లు లేదా రూ. 30,000 కోట్లు తగ్గుతుంది.
  • E20 ఇంధనం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడం మరో ప్రధాన ప్రయోజనం. ఇథనాల్ చెరకు, వరి పొట్టు,  మొక్కజొన్న వ్యర్థాలు, ఇతర ఆహార ధాన్యాల నుంచి తయారు చేస్తారు.  అందువల్ల, రైతులు తమ మిగులు ఉత్పత్తులను ఇథనాల్ మిశ్రమ తయారీదారులకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

e20 ధర ఎంత ఉండొచ్చు..

e20 petrol price :  జియో బీపీ ఉత్పత్తి చేసిన  E20 ఇంధనంలో 80శాతం పెట్రోల్‌, 20శాతం ఇథనాల్‌ ఉంటుంది.  ప్రస్తుతం న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయలుగా ఉంది. ఇందులో 80 శాతం పెట్రోల్ అంటే రూ.76.80 ఉంటుంది. అలాగే లీటర్‌ ఇథనాల్‌ రూ.55 ఉంటుంది. ఇందులో 20 శాతం అంటే రూ.11 ఉంటుంది..  అంటే లీటర్‌ E20 పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్‌ (రూ.76.80) + 20 శాతం (రూ.11) గా ఉంటుందని చెప్పవచ్చు.  ఫలితంగా ఈ E20 ఇంధనం ధర రూ.87.80కి వస్తుంది. సాధారణ లీటర్‌ పెట్రోల్‌ తో పోలిస్తే.. రూ.8.20 తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

ముగింపు

భారతదేశం గ్రీన్ మొబిలిటీ వైపు సానుకూలంగా కదులుతోంది. 2030 నాటికి అధిక శక్తి వినియోగాన్ని పునరుత్పాదక వనరులకు తరలించే లక్ష్యం E20 ఇంధన మిశ్రమం, సీఎన్జీ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల ను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..