Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

500 కిలోల సరుకులను ఈజీగా మోసుకెళ్తుంది.. ఫ్యామిలీ, వాణిజ్య అవసరాలకోసం కొత్త ఈవీ

Spread the love

Komaki : భారత మార్కెట్లో ఇటీవ‌ల కాలంలో స‌రికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా కొమాకి (Komaki సంస్థ  Komaki XGT CAT 3.0 పేరుతో  ఇ-లోడర్‌ను విడుదల చేసింది.  అయితే ఇది మూడు చక్రాల స్కూటర్‌. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం..

భారత్‌లో ఈవీ  మార్కెట్‌ శరవేగంగా దూసుకుపోతోంది. తక్కువ రవాణా ఖర్చు కోసం  ఈవీల వైపు ప్రజలు మొగ్గుచూస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్ కు అనుగుణంగా  పలు కంపెనీననూ అత్యాధునిక సాంకేతికతతో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.  అయితే ఈవీ మార్కెట్‌లో ప్రస్తుతం టూ వీలర్లు టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఆ తర్వాత త్రీవీలర్లు నిలిచాయి. అయితే   వాణిజ్య, వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా  Komaki  కంపెనీ కొత్తగా  త్రీ వీలర్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది.   లాజిస్టిక్స్,  ఇంట్రా-సిటీ రవాణా సమస్యలను   Komaki XGT CAT 3.0  పరిష్కరిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.

Komaki XGT CAT 3.0 స్పెసిఫికేషన్స్

కొమాకి ఎక్స్ జీటీ క్యాట్  3.0 ఎలక్ట్రిక్  స్కూటర్.. దాని బలమైన ఐరన్ బాడీతో ఇ-లోడింగ్ వాహనాల్లో ప్రత్యేకంగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. అద్భుతమైన బిల్ట్‌ క్వాలిటీతో పాటు రన్నింగ్ సరైన స్టెబిలిటీని అందిస్తుందని వెల్లడించింది.  ఈ త్రీ వీలర్‌ ఇ స్కూటర్‌లో పెద్దదైన ,  సౌకర్యవంతమైన సీటుతో పాటు విశాలమైన ఫుట్‌బోర్డ్‌ ను కలిగి ఉంది.

Komaki XGT CAT 3.0 Price : ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ (ఎక్స్-షోరూమ్ ధర రూ.1.6 లక్షలు గా ఉందని సంస్థ వెల్లడించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకంగా దివ్యాంగులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.  దీనిని డ్రైవ్ చేయడం  చాలు సులువు. ఇక ఈ స్కూటర్‌లోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ వాహనం 500 కిలోల వరకు లోడింగ్ కెపాసిటీని  కలిగి ఉంటుంది. XGT CAT 3.0 స్కూటర్‌ సరుకుల బరువును బట్టి సుమారు  120 నుంచి 180 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది.

ఫీచర్లు..

కొమాకీ ఎలక్ట్రిక్ త్రీవీలర్ లో  12-అంగుళాలతో మూడు చక్రాలు, సేఫ్టీ కోసం బ్రేక్ లివర్‌లతో కూడిన ట్రిపుల్ డిస్క్ సిస్టమ్‌ ఉంటుంది.  సెల్ ఫోన్  ఛార్జింగ్ పాయింట్, యాంటీ థెఫ్ట్ లాక్, రిమోట్ లాక్, టెలిస్కోపిక్ షాక్స్, పార్కింగ్ అసిస్ట్  తోపాటు  క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ స్కూటర్‌లో పోర్టబుల్ ఛార్జర్‌తో కూడిన ఫైర్ రెసిస్టెంట్ గ్రాఫేన్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చినట్లు సంస్థ పేర్కొంది.  XGT CAT 3.0 స్కూటర్‌లో వైర్‌లెస్ అప్‌డేట్‌లతో కలర్‌ఫుల్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. ఇందులో  రియల్ టైమ్ రైడ్ వివరాలను చూడొచ్చు.   అంతేకాకుండా 500 కిలోల లోడ్ సామర్థ్యంతో నడుపుతున్నప్పుడు కూడా  ఎలాంటి కుదుపులు లేకుండా  మెరుగైన పనితీరు, సామర్థ్యం, ​​స్థిరత్వం, భద్రతను అందిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.

వాహనదారుల భద్రత, సౌకర్యంతో పాటు పనితీరుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ  కొమాకి XGT CAT 3.0 స్కూటర్‌ను డిజైన్‌ చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు   కొమాకి ఎలక్ట్రిక్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా వివరించారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *