Kinetic E-Luna Electric Moped Launched | కైనెటిక్ లూనా, 1970 , 80లలో పాపులర్ అయిన ప్రసిద్ధ మోపెడ్, ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనం రూపంలో తిరిగి వచ్చింది. ఇ-లూనా బుకింగ్‌లను ప్రారంభించిన 15 రోజుల తర్వాత, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ బ్యాటరీతో నడిచే టూనా మోపెడ్‌ను ఈరోజు ప్రారంభించింది. భారతదేశంలో రూ. 69,990, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని లాంచ్ చేశారు. కంపెనీ జనవరి 26న బుకింగ్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే.. కొత్త E-లూనా ఇప్పటి వరకు 40,000 బుకింగ్‌లు నమోదు చేసుకుందని కైనెటిక్ పేర్కొంది.
Kinetic E-Luna స్పెసిఫికేషన్స్
కొత్త లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంది, అయితే దీర్ఘచతురస్రాకార కేస్ లో గుండ్రని హెడ్‌లైట్, మినిమం బాడీవర్క్, బాక్సీ డిజైన్రి.. లాక్స్డ్ రైడింగ్ పొజిషన్ వంటి ఆధునిక హంగులతో ఉంది. స్ప్లిట్ సీట్ డిజైన్ E-Luna లో కొత్తగా చూడొచ్చు. ఇది పెట్రోల్ మోపెడ్‌పై ఉన్న పెడల్స్‌ను తీసేశారు. స్టోరేజ్ కోసం వెనుక సీటును తీసివేయవచ్చు. E Luna కేవలం 96kg బరువుతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది Kinetic E-Luna 150kg ల వరకు బరువును మోయగలదని కైనెటిక్ పేర్కొంది.
Range | 110 కి.మీ |
Top Speed | 50+ కిమీ/గం |
బ్యాటరీ | లిథియం-అయాన్ NMC |
బ్యాటరీ సామర్థ్యం | 2 kWh |
ఫ్రంట్ సస్పెన్షన్లు | హైడ్రాలిక్ టెలిస్కోపింగ్ |
వెనుక సస్పెన్షన్లు | స్ప్రింగ్‌తో డ్యూయల్, హైడ్రాలిక్ డంపర్ |
బ్రేకింగ్ సిస్టమ్ | CBS |
బ్రేకులు | వెనుక, ముందు డ్రమ్ బ్రేక్స్.. |
ఫీచర్ల విషయానికొస్తే.. E-లూనాలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్ షాక్‌లు, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి., ట్యూబ్డ్ టైర్‌లతో కూడిన 16-అంగుళాల స్పోక్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ సెన్సార్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
E-Luna కు శక్తినిచ్చేందుకు 2kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చిన కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. E-Luna గరిష్ట వేగం 50kmph. దీని బ్యాటరీ ప్యాక్‌ను నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇదిలా ఉండగా E Luna 1.7 kWh మరియు 3.0 kWh బ్యాటరీ సామర్థ్యాలతో మరో రెండు వేరియంట్లలో కూడా అందుబాటులో ఉండనుంది. రెండోది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150కిమీ రేంజ్ ఇస్తుంది.
లూనా బరువు కేవలం 96 కిలోలు, ఈ రోజు భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత తేలికైన ద్విచక్ర వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఎలక్ట్రిక్ మోటారు 22Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ పేర్కొంది. E-లూనా వ్యక్తిగత అవసరాలతోపాటు వాణిజ్య ప్రయోజనాలకు సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. కాగా ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోల్చినప్పుడు పోటీగా ఎన్నో కంపెనీల మోడళ్లు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయి. కానీ E-Luna వాటితో పోటీ పడటానికి ఇక్కడ ఏదీ లేదు.
రూ.500లకే బుకింగ్స్..
Kinetic E Lunaని రూ. 500 టోకెన్ మొత్తానికి బుక్ చేసుకోవచ్చు.డెలివరీలు అన్ని డీలర్‌షిప్‌ల నుండి ‘త్వరలో’ ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది కానీ ఖచ్చితమైన టైమ్‌లైన్ ఇవ్వలేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుండి కూడా E Lunaని కొనుగోలు చేయవచ్చు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..