Home » Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

ather-ola-simple
Spread the love

Ola S1 Pro Simple One Ather

ather-ola-simple
ather-ola-simple

పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో అంద‌రూ ఎలక్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మార్కెట్లో ఎన్నో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ చాలా వాటిలో రేంజ్ (మైలేజీ) ఉంటే స్పీడుండ‌దు.. స్పీడుంటే రేంజ్ ఉండడ‌దు. ఈ రెండూ ఉన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అత్యంత అరుదైన విష‌యం. అయితే ఇటీవ‌ల స‌మ‌స్య‌ను అధిక‌మిస్తూ ప‌లు కంపెనీలు అత్యంత ఆధునిక ఫీచ‌ర్ల‌తో హైస్పీడ్, హై రేంజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను విడుద‌ల‌చేశాయి. అవే ఏథ‌ర్‌450ఎక్స్‌, Ola S1 Pro, Simple One. వీటి రాక‌తో ఈవీ రంగానికి స‌రికొత్త ఊపు వ‌చ్చింది.

Ola S1 Pro Simple One Ather ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో త‌క్కువ ధ‌ర‌లోనే విడుద‌ల‌య్యాయి. సింపుల్ వ‌న్ స్కూట‌ర్ ప్రపంచంలోనే అత్యంత రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కంపెనీ ప్ర‌క‌టించుకుంది. ప్రీమియం ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు అథర్ 450X తిరుగులేని రారాజుగా ఉండింది. కానీ దీనిపై ఇప్పుడు ఓలా, సింపుల్ వ‌న్ పైచేయి సాధించాయి. అయితే ఈ మూడు స్కూట‌ర్ల‌లో ఉన్న స్పెసిఫికేష‌న్లు వాటి తేడాలు ఏంటో చూద్దాం..

రేంజ్

  • ఏథర్ 450X ఒక పూర్తి ఛార్జ్‌పై 116 కిమీల క్లెయిమ్ చేయబడిన సర్టిఫైడ్ రేంజ్‌తో వస్తుంది. అయితే, రోడ్డు కండీష‌న్ ను బ‌ట్టి కంపెనీ 450X కోసం 85 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తుంది.
  • ఓలా ఎస్ 1 ప్రో బ్లాక్‌లో పూర్తి ఛార్జ్‌లో 181 కిమీ రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది, ఇది దాదాపు 450X రేంజ్ కంటే రెట్టింపు.
  • ఇక్కడ రేంజ్ విష‌యంలో సింపుల్ వన్ విజేత‌గా నిలిచంది. ఒక సింగిల్ చార్జిపై గ‌రిష్టంగా 236కిలోమీట‌ర్ల రేంజ్ ఇస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఇది ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా రేంజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ స్క‌ట‌ర్‌గా నిలిచింది. ఈ విష‌యంల సింపుల్ వ‌న్‌కు ప్ర‌స్తుతానికి ఏదీ సాటి లేదు. అయితే కంపెనీ క్లెయిమ్ రేంజ్ ఎకో మోడ్‌లో 203 కిమీ వ‌స్తుంద‌ని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ ఇది మిగ‌తా అన్ని స్కూట‌ర్ల కంటే ఎక్క‌వే..

బ్యాటరీ

  • ఏథ‌ర్ 450 ఎక్స్‌, ఓలా, సింపుల్ వ‌న్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ సామర్థ్యాల విష‌యానికొస్తే.. ఏథర్ 450X లో 2.9 kWh బ్యాటరీ ఉంటుంది.
  • ఇక ఓలా S1 ప్రో స్కూట‌ర్‌లో 3.97 kWh బ్యాటరీని వినియోగించారు.
  •  సింపుల్ వ‌న్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌లో 4.8 kWh అత్యధిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే బ్యాట‌రీ విష‌య‌లోనూ సింపుల్ వ‌న్ పై చేయి సాధించింది.

నార్మ‌ల్ చార్జింగ్‌, ఫాస్ట్ ఛార్జింగ్

  • సాధారణ ఛార్జర్ ద్వారా ఏథర్ 450X లోని బ్యాటరీని 4.45 గంట‌ల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
  • ఓలా ఎస్ 1 ప్రోలోని బ్యాటరీని 6.30 గంట‌ల్లో చార్జి చేయ‌వ‌చ్చు.
  • ఇక సింపుల్ వన్‌లో డిటాచ‌బుల్ బ్యాటరీని వినియోగించ‌డం విశేషం. ఈ బ్యాట‌రీని ఏదైనా సాధారణ 15A సాకెట్ ద్వారా కేవ‌లం 2.5 గంటల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.
  • ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే. ఏథర్ 450X లోని బ్యాటరీని కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లో నిమిషానికి 1.5 కిమీ చొప్పున ఛార్జ్ చేయవచ్చు, దీనిని ఏథర్ గ్రిడ్ అని పిలుస్తారు.
  • ఓలా S1 ప్రోలోని బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీంతో సుమారు 75 కిలోమీటర్ల రేంజ్ ల‌భిస్తుంది.
  • అయితే ఇక్క‌డ కూడా ఫాస్ట్ ఛార్జర్ లేదా సింపుల్ లూప్‌తో సింపుల్ ఎనర్జీ ఇక్కడ ముందంజలో ఉంది. ఈ స్కూటర్ బ్యాటరీని నిమిషానికి 2.5 కిమీ చొప్పున 80 శాతం ఛార్జ్ చ‌య‌వ‌చ్చు. దీన్ని బ‌ట్టి ఒక స్మార్ట్ ఫోన్‌ను చార్జింగ్ పెట్టుకున్నంత సులువుగా చార్జ్ చేసుకోవ‌చ్చు.

టాప్ స్పీడ్

ఒక‌ప్పుడు 60 kmph కంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహ‌నాల‌లో ప్యూర్ ఈవీ 7జీ, బ‌జాజ్‌, టీవీఎస్ ఐక్యూబ్‌తో పాటు ఇత‌ర వాహ‌నాలు ఉండేవి.

  • ఏథర్ 450X 90 kmph గరిష్ట వేగంతో హైస్పీడ్ వెహికిల్‌గా జాబితాలో చేరింది.
  •  సింపుల్ ఎనర్జీ వన్ గరిష్టంగా 105 kmph వేగాన్ని అందుకోగ‌ల‌దు.
  • ఓలా ఎస్ 1 ప్రో వీట‌న్నింటికీ ఎక్కువ‌గా గంట‌కు 115 కిలోమీటర్ల వేగంతో రేసులో ముందుకు దూసుకెళ్లిపోయింది.

యాక్సిల‌రేష‌న్

  • ఏథర్ ఎనర్జీ 450X కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
  • ఓలా ఎస్ 1 ప్రో 3 సెకన్ల లోనే 40కి.మి. వేగాన్ని పొందుతుంది.
  • ఇక సింపుల్ ఎనర్జీస్ వన్ కేవలం 2.95 సెకన్లలోనే 0 నుండి 40 కిమీ స్పీడ్‌ను చేరుకుంటుంది.

ఫీచర్లు

Ola S1 Pro Simple One Ather స్కూటర్లలో ఫుల్ క‌ల‌ర్స్‌లో 7 అంగుళాల టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్‌లు ఉన్నాయి. ప్రయాణంలో నిరంత‌రం కనెక్ట్ కావ‌డానికి ఈ మూడు కూడా 4G, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తాయి. వీటిలో గ్రాఫికల్ నావిగేషన్ సపోర్ట్‌తో పాటు మ్యూజిక్, కాల్ స‌పోర్ట్ ఉంటుంది. మూడు ఇ-స్కూటర్లు కూడా మీకు స‌మీపంలోని ఫాస్ట్ ఛార్జర్ పాయింట్ల‌ను చూపిస్తాయి. ఇక వ్య‌త్యాసాల విషయానికి వస్తే. సింపుల్ వన్ TPMS లేదా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఓలా ఎస్ 1 ప్రోలో టిపిఎంఎస్ లేదు. రాబోయే OTA అప్‌డేట్ ద్వారా ఏథ‌ర్‌ 450X లో టీపీఎంఎస్‌ అందించాలని కంపెనీ యోచిస్తోంది.

ఓలా ఎస్ 1 ప్రో స్కూట‌ర్‌లో అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్‌గా ప్రత్యేకంగా కనిపించే ఫీచర్లు క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, బ్రేక్ ప్యాడ్ వేర్ సెన్సార్ మరియు వాయిస్ అసిస్టెంట్ ఉన్నాయి. కాగా ఈ మూడు స్కూటర్లు రివర్స్ మోడ్‌ని అందిస్తున్నాయి.

ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

  • ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ .1.32 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ, సబ్సిడీల తర్వాత). ఈ మూడింటిలో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా ఏథ‌ర్ నిలిచింది.
  • సింపుల్ ఎనర్జీస్ వన్ రూ.1.10 లక్షల ధరతో లాంచ్ అయింది. సమీప భవిష్యత్తులో కేంద్ర రాష్ట్రాల స‌బ్సిడీతో ఈ ధర గణనీయంగా తగ్గవ‌చ్చు.
  • ఓలా ఎస్ 1 ప్రో ధర రూ .1,29,999.

 

3 thoughts on “Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *