Electric Highway | రవాణా రంగం భవిష్యత్ క్రమంగా మారిపోతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అందరూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేందుకు సబ్సిడీలు అందిస్తూ వినియోగదారులను ప్రోత్సహిస్తోంది.
ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై తరచూ కనిపిస్తుంటాయి. వీటికి పెద్ద మొత్తంలో కరెంట్ అవసరమవుతుంది.
అయితే మధ్యలో ఛార్జింగ్ ఐపోయినా లేదా ఛార్జింగ్ కోసం ఎక్కడైనా ఆగినా చాలా సమయం వృథా అవుతుంది. దీనివల్ల విద్యుత్ తో నడిచే భారీ ట్రక్కులపై వినియోగదారులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే ఇలాంటి ఇబ్బందులు అధిగమించేందుకు ఎక్కువగా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
కదులుతుండగానే చార్జింగ్
ఈ నేపథ్యంలో పలు దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న హైవే ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ మనదేశంలోనూ మొదటిసారిగా తీసుకురాబోతున్నారు. ఇకపై హైవేలో వెళ్లే భారీ వాహనాలు పెట్రోల్ డీజిల్ తో కాకుండా విద్యుత్ శక్తితో పరుగులు పెట్టనున్నాయి. రైళ్లు, మెట్రో ట్రెయిన్లు మాదిరిగానే హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా నడవనున్నాయి.
గతంలో ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీ తొలిసారి ఉపయోగించింది. ఇందులో భాగంగా హైవేలపై వెళ్లే ట్రక్కుల పై భాగంలో రైళ్ల మాదిరిగా కరెంట్ సరఫరా కోసం ప్రత్యేక కరెంట్ తీగల ఏర్పాటు ఉంటుంది. ఈ కేబుల్స్ నుంచి ట్రక్కులోని బ్యాటరీల్లోకి విద్యుత్ సరఫరా అవుతుంది. అవి రీచార్జ్ అవుతూ ట్రక్కు ముందుకు సాగిపోతుంది. హైవే నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత ఎలాగూ అప్పటికే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి కాబట్టి అందులోని విద్యుత్ ను వినియోగించుకుని వాహనం ముందుకు కదులుతుంది. ఈ టెక్నాలజీతో మార్గమధ్యలో మళ్లీ ఆగి ఛార్జింగ్ చేసుకోకుండా వాహనం కదులుతున్నప్పుడే చార్జింగ్ అయ్యే వెసులుబాటు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
సోలార్ ఎనర్జీతో..
సోలార్ ఎనర్జీ సహాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈవిషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం సోలార్, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ మెకానిజాన్ని వినియోగించుకోవాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. న్యూఢిల్లీ-జైపుర్ మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే జర్మనీ, స్వీడన్, నార్వే వంటి దేశాల్లో ఈ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని, రహదారిపై ఏర్పాటు చేసిన పవర్ కేబుళ్ల విద్యుత్ ను వాడుకొని వాహనాలు సునాయాసంగా ప్రయాణిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
This is next level 👌 https://t.co/OZK5HMoRJG
— KTR (@KTRBRS) December 30, 2023
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించగలరు.
Great innovation..