Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Spread the love

Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

 

Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించింది. విక్రయించిన అన్ని ఎలక్ట్రిక్ మహీంద్రా 3-వీలర్లలో, ట్రియో శ్రేణి ఎంతో స‌క్సెస్ తోపాటు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. 2019 సంవత్సరపు ఎలక్ట్రిక్ 3-వీలర్, మేడ్-ఇన్-ఇండియా ఇన్నోవేషన్ కోసం ఆటో రిటైల్ మార్కెటింగ్‌లో గ్లోబల్ అవార్డ్స్ వ‌రించాయి.

ఈ విష‌య‌మై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) సీఈవో సుమన్ మిశ్రా మాట్లాడుతూ.. “ ఈ వర్గాన్ని నిర్మించడంలో మేము శక్తి వంచ‌న లేకుండా కృషి చేశాం. వాహ‌నాల విష‌య‌మై సంతృప్తితో ఉన్న కస్టమర్‌లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అని తెలిపారు.

ఈ ప్రయాణంలో 50000+ Mahindra Electric Three-Wheelers (ఎలక్ట్రిక్ 3-వీలర్) మైలురాయిని దాటడం గొప్ప‌విష‌యం. మేము 133 మిలియన్ల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కిలోమీటర్లను అధిగమించాం. 27,566 మెట్రిక్ టన్నుల CO₂ ఆదా చేశాం. లేకుంటే 6.1లక్షల కంటే ఎక్కువ చెట్లను నాటడం అవసరం అని సుమ‌న్ మిశ్రా తెలిపారు. ఇ ఆల్ఫా కోసం అపోలో సివి మ్యాగజైన్ నుండి గుర్తింపు అవార్డు, గ్రీన్ వెహికల్ ఎక్స్‌పో 3వ ఎడిషన్‌లో గ్రీన్ అచీవర్ 2022 అవార్డును కూడా గెలుచుకుంది అని పేర్కొన్నారు.

Tech newsTech news

More From Author

Ellysium electric scooter

Ellysium electric scooter విడుద‌లైంది..

Bounce-Infinity-E1

Flipkart లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *