Electric two-wheelers sales

ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?

Spread the love

Electric two-wheelers sales  : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్య‌తుత్త‌మ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుక‌బ‌డిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో జోరు కొనసాగుతోంది. వార్షిక విక్రయాల సంఖ్య 237 శాతం పెరిగి 50,076 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే జూలైలో విక్రయించిన 44,430 EVల కంటే 13 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది.

ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాల్లో Hero Electric ( హీరో ఎలక్ట్రిక్ ) దాని మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయితే ఆంపియర్, TVS వంటి ఇతర కీలక కంపెనీలు వార్షిక అమ్మకాల పరంగా చ‌క్క‌ని వృద్ధి న‌మెదు చేసుకున్నాయి. జూలైలో విక్రయించిన 8,788 EVలతో పోలిస్తే హీరో ఎలక్ట్రిక్ ఆగస్ట్‌లో 10,206 యూనిట్ల వద్ద పోల్ పొజిషన్‌ను కొనసాగించింది, నెలవారీ అమ్మకాలలో 16 శాతం పెరుగుదల క‌నిపిస్తోంది.

Electric two-wheelers sales లో Okinawa (ఒకినావా), Ampere (ఆంపియర్ ) కూడా వరుసగా రెండు నెలల పాటు తదుపరి అత్యుత్తమ ప్రదర్శన క‌న‌బ‌రిచాయి. ఒకినావా జూలై 8,095 యూనిట్ల అమ్మకాలు జ‌ర‌గ‌గా ఆగ‌స్టులో 6 శాతం వృద్ధితో 8,554 యూనిట్లతో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 2,855 యూనిట్లతో పోలిస్తే కంపెనీ 200 శాతం Y-o-Y పెరుగుదలను నమోదు చేసింది.
Ampere వెహికల్ కేవలం 1 శాతం M-o-M పెరుగుదలను న‌మోదు చేసింది. 6,319 EVలతో మునుపటి నెలతో పోలిస్తే ఆగస్టులో 6,396 యూనిట్లతో మూడవ స్థానంలో కొనసాగుతోంది. గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన 797 యూనిట్లతో పోలిస్తే 703 శాతం Y-o-Y అమ్మకాలను కలిగి ఉంది.

TVS Motors గత ఏడాది 651 యూనిట్లతో పోలిస్తే 865 శాతం Y-o-Y పెరుగుదలతో 6,282 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. టీవీఎస్ కంపెనీ జూలైలో 4,290 యూనిట్లు విక్ర‌యించ‌గా, ఆగ‌స్టులో 6,282 మూనిట్ల‌ను విక్ర‌యించి 46 శాతం M-o-M పెరుగుదలను కలిగి ఉంది.

Ather Energy ఈ ఏడాది జూలైలో 1,289 యూనిట్లతో పోలిస్తే 306 శాతం M-o-M వృద్ధితో 5,239 యూనిట్లతో గేమ్‌ను పెంచింది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది.

More From Author

Tata Nexon EV JET

అదిరే లుక్‌తో Tata Nexon EV JET

Hop Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *