Home » 150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

Hop Oxo electric bike
Spread the love

Hop Oxo electric bike

Range :150 km
Price : Rs 1.25 lakh

జైపూర్‌కు చెందిన EV స్టార్టప్.. Hop Electric Mobility .. దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త Hop Oxo electric bike  భారతదేశంలో రూ. 1.25 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్. )తో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు రూ.999 టోకెన్ మొత్తానికి ప్రారంభమ‌య్యాయి. డెలివరీలు అక్టోబర్ 1, 2022న స్టార్ట్ కానున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జి చేస్తే 150 కిమీ వ‌ర‌కు రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

రెండు వేరియంట్లు

Hop Electric తన ఈ-బైక్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. మొద‌టిది Oxo. రెండోది Oxo-X.
Oxo 3-సంవత్సరాలు లేదా 50,000 km స్టాండ‌ర్డ్ వారంటీ తో వ‌స్తుంది. Oxo-X వేరియంట్‌కు (ధర రూ. 1.40 లక్షలు) 4 సంవత్సరాల అపరిమిత km వారంటీ ఉంటుంది. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి సమీప హాప్ ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ నుంచి ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయవ‌చ్చు.

Hop Oxo electric bike

Hop Oxo (హాప్ ఆక్సో) 72V ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తుంది. 200 Nm పీక్ టార్క్‌ను అందించే 6.2 kW ఎలక్ట్రిక్ మోటారును క‌లిగి ఉంటుంది. ఇది Oxo-X కోసం అదనపు టర్బో మోడ్‌తో మూడు రైడింగ్ మోడ్‌లను (ఎకో, పవర్, స్పోర్ట్) క‌లిగి ఉంది. టర్బో మోడ్‌లో Hop Oxo-X గరిష్టంగా 90 kmph వేగాన్ని అందిస్తుంది. ఇది 4 సెకన్లలో 0-40 kmph స్పీడ్‌ను అందుకుంటుంది.
ఈ బైక్‌లు 3.75 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటాయి. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 150 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Oxo బైక్‌ను దాని పోర్టబుల్ ఛార్జర్‌తో ఏదైనా 16 Amp పవర్ సాకెట్‌లో ఛార్జ్ చేయ‌వ‌చ్చు. 4 గంటల్లోనే 0-80 శాతం ఛార్జ్ అవుతుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్‌ల‌కు 4G కనెక్టివిటీతో 5.0-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ అమ‌ర్చారు.

Hop Oxo electric bike  లాంచ్ సందర్భంగా CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. “ భారతీయ ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్‌ను తుఫానుగా తీసుకుంటోంది. స్థిరమైన, అనుకూలమైన, సరసమైన మొబిలిటీ సొల్యూషన్‌ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. HOP OXO అనేది అనేక సంవత్సరాల R&D, రోడ్ టెస్టింగ్, వందలాది మంది HOP ఉద్యోగులు తమ చెమటను చిందించి మార్కెట్‌లో అత్యంత ప్రగతిశీలమైన ఈ-బైక్‌ను లాంచ్ చేశార‌ని తెలిపారు.

ఆక్సోలో డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ అలాగే టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉన్నాయి. రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. హోప్ కంప‌నీ హాప్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల కోసం నిధులు ఖర్చు చేస్తోంది. ఇందులో బ్యాటరీలను దాదాపు 20 సెకన్లలో మార్చడానికి వీలుంటుంది. Hop Oxo Electric భారతదేశంలో ఇప్పటికే 140 కంటే ఎక్కువ టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది.

Variant-wise ex-showroom price:

Hop Oxo – Rs 1.25 lakh
Hop Oxo X – Rs 1.4 lakh

3 thoughts on “150 కి.మీ రేంజ్‌తో Hop Oxo electric bike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *