Electric vehicle battery safety standards

Electric Vehicles మంట‌ల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?

Spread the love

EVల‌ను బ్యాట‌రీల‌ను సురక్షితంగా ఎలా ఉంచాలి?

గ‌త కొన్ని నెల‌లుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో చిక్కుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న వేళ వాహ‌న‌దారులు ఈవీల వైపు చూస్తున్నారు. భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలేన‌ని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అగ్ని ప్రమాదాలకు గుర‌య్యాయి. (Electric vehicle battery safety standards)

EVలకు మంటలు అంటుకుంటున్న సంఘ‌ట‌న‌లు కొన్నేళ్లుగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ.. ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ, వంటి ప్రముఖ బ్రాండ్ల‌కు చెందిన ఈవీలు కూడా కాలిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

  • ఓలా ఎలక్ట్రిక్ విడుద‌ల చేసిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 మార్కెట్‌లో ప్ర‌భంజ‌న‌మే సృష్టించింది. అయితే పూణెలో ఒక చోట పార్క్ చేసిన ఓలా ఎస్‌1 ప్రో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ పూర్తిగా కాలిపోయింది.
  • తమిళనాడులోని వేలూరులో జరిగిన మరో సంఘటన ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. రాత్రంతా చార్జింగ్ పెట్టిన కొత్త ఒకినావా స్కూటర్‌కు మంటలు అంటుకోవడంతో తండ్రి కుమార్తె మృతి చెంద‌డం విషాద‌క‌రం.
  • తిరుచిరాపల్లి (TN)లో మరో ఒకినావా ఈ-స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. చెన్నైలో రద్దీగా ఉండే రహదారి పక్కన ప్యూర్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవల మంటల్లో చిక్కుకుంది.
  • తెలంగాణలోని వ‌రంగ‌ల్ జేపీఎన్ రోడ్డులో ప్యూర్ ఈవీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మంట‌ల్లో చిక్కుకొని పూర్తిగా ద‌గ్ధ‌మైంది.

Electric vehicle battery safety standards

ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకు పేలిపోతున్నాయి?

ఎలక్ట్రిక్ వాహనాలు లిథియం-అయాన్ బ్యాటరీల ద్వారా ఎన‌ర్జీని పొందుతాయి. స్మార్ట్‌ఫోన్‌లలో కూడా లిథియం అయాన్ బ్యాట‌ల‌రీల‌నే ఉప‌యోగిస్తార‌నే విష‌యం తెలిసిందే.. గ‌తంలో స్మార్ట్‌ఫోన్‌లు కూడా పేలిపోయిన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.
Electric Vehicles (EV) లు గంట‌ల‌కొద్దీ ఎండ, వర్షం, ధూళి మ‌ధ్య‌లో ఉంటాయి. వీటిని ఎల్లప్పుడూ చల్లని పొడి పరిస్థితుల్లో ఉంచలేం. చాలా కంపెనీలు తమ వాహ‌నాల‌ బ్యాటరీలకు IP రేటింగ్‌ను అందించినప్పటికీ, అవి భారతీయ వేసవికాలపు విపరీతమైన వేడికి త‌ట్ట‌కుకోలేనిగా ఉంటాయి. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో చాలా వ‌ర‌కు ఇత‌ర దేశాల్లో త‌యారై ఇక్క‌డికి దిగుమ‌తి అవుతాయి. ఇత‌ర దేశాల్లో అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితికి అనుగుణంగా రూపొందించిన వాహ‌నాలు మ‌న‌దేశ‌పు వేడి వాతావ‌ణానికి త‌ట్టుకోలేక‌పోతున్నాయి.

అగ్ని ప్ర‌మ‌దాల నివాణ‌కు ఏం చేయాలి?

భారతదేశంలో ఇంధ‌న ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు రూ.115 మార్కును దాటాయి, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు గతంలో కంటే చాలా ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యకు Electric Vehicles పరిష్కారాన్ని అందిస్తాయి. అందుకనే వీటి అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Electric vehicle battery safety standards

Electric Vehicles, Battery  విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవ‌డం ద్వారా అగ్ని ప్ర‌మాదాలు, షార్ట్‌స‌ర్క్యూట్లు, పేలుళ్లను నివారించడమే కాకుండా, మెరుగైన రేంజ్‌, బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవ‌చ్చు

  • వేసవి రోజులలో మీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నీడలో పార్క్ చేయండి (ఎప్పుడూ డైరెక్ట్ ఎండ‌లో ఉండకూడదు)
  • బ్యాట‌రీ మార్చేట‌ప్పుడు బ్యాటరీ ప్యాక్‌ని జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేయండి
  • ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ‌గా ఉన్న రోజుల్లో సాధారణ మోడ్ (ఎకో మోడ్‌) ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని నడపడం మంచిది
  • వేసవిలో రాత్రిపూట మీ EVని ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి, రాత్రంతా (ఓవర్‌నైట్) ఛార్జింగ్ పెట్ట‌డం ఏమాత్రం మంచిది కాదు
  • Electric Vehicles బ్యాటరీలు గది ఉష్ణోగ్రతకు చల్లబడిన తర్వాత ఛార్జింగ్ పెట్టండి
  • హీట్ సోర్స్ దగ్గర ఛార్జింగ్ చేయొద్దు.
  • ఎల‌క్ట్రిక్ వాహ‌నాల్లో కంపెనీ ఇచ్చిన ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి. దాని ద్వారాన‌నే చార్జింగ్ పెట్టుకోవాలి. ఇత‌ర కంపెనీల‌ ఛార్జర్‌ను ఉపయోగించవద్దు.
  • బ్యాటరీలను గది ఉష్ణోగ్రత వద్ద మాత్ర‌మే ఉంచాలి.
  • వాహ‌నాన్ని ఉపయోగించిన తర్వాత ఒక‌ గంటలోపు బ్యాటరీలను ఛార్జ్ చేయవద్దు. బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి ముందు కొంత సమయం పాటు చల్లబడిన త‌ర్వాతే చార్జింగ్ పెట్టుకోవ‌డం మంచిది.
  • Battery కేసింగ్ దెబ్బతిన్నట్లు లేదా నీరు చొరబడినట్లు మీరు గుర్తిస్తే వెంటనే ఆ బ్యాట‌రీని వెలికి తీసి వాహ‌నానికి దూరం గా ఉంచి మీ డీలర్‌కు తెలియజేయండి.
  • బ్యాటరీ, ఛార్జర్ ల‌ను శుభ్రమైన, పొడి, వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి, వేడి ప్ర‌దేశాలు, మంట‌లకు దూరంగా ఉంచాలి. మండే పదార్థాల నుండి దూరంగా ఉంచండి.

More From Author

LML Electric hyper bikes

LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…

revolt RV 400

Revolt – RV400 బుకింగ్ ఓపెన్

One thought on “Electric Vehicles మంట‌ల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *