Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

దేశ దేశ‌వ్యాప్తంగా 380 EV chargers

Spread the love

17 న‌గ‌రాల్లో ఏర్పాటు చేసిన EVI Technologies

EV chargers  ఈవీ రంగం అభివృద్ధిలో చార్జింగ్ మౌలిక స‌దుపాయాలు, బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు ఎంతో కీల‌కం. మ‌న దేశంలో ఇవి త‌గిన‌న్ని లేక‌పోవ‌డం ఈవీ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంది. అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక సంస్థ‌లు ఈ రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటుకు కూడా ముందుకు వ‌స్తున్నాయి.

తాజాగా EVI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(EVI Technologies) (EVIT) భారతదేశంలోని 17 నగరాల్లో 380 EV ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. 2017 జూన్ లో EVIT ని స్థాపించారు. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

హైద‌రాబాద్ స‌హా 17 న‌గ‌రాల్లో..

EVI Technologies సంస్థ హైదరాబాద్, ఢిల్లీ-NCR, రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్), పాట్నా, రాంచీ, రాయ్‌పూర్, దంతేవాడ, థానే, మధురై, త్రివేండ్రం, చెన్నై, అహ్మదాబాద్, భోపాల్, హల్ద్వానీ, రుద్రపూర్, హాపూర్, షిల్లాంగ్, సోనిపట్ స‌హా 17 నగరాల్లో EV chargers ను ఏర్పాటు చేసింది.

EV chargers ఏర్పాటు పై EVI టెక్నాలజీస్ CEO రూపేష్ కుమార్ మాట్లాడుతూ, “మేము 17 నగరాల్లో 380 EV ఛార్జీలను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసామని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నామని తెలిపారు. సరసమైన ధరకు ఉత్పత్తులు, సేవలను అందించడం ద్వారా 100% కస్టమర్ సంతృప్తిని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. భారతదేశానికి అత్యుత్తమమైన తక్కువ-ధరతో EV ఛార్జర్‌లను అందించగలగడం గ‌ర్వంగా ఉంద‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో డిమాండ్‌కు అనుగుణంగా భారతదేశంలోని ఇతర మెట్రోపాలిస్ నగరాల్లో మరిన్ని EV chargers ఇన్‌స్టాల్ చేస్తామ‌ని తెలిపారు.

అత్యాధునిక టెక్నాల‌జీతో ..  

EVIT సంస్థ అన్ని రకాల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్‌లను అందిస్తోంది. ఇది వినియోగదారులు త‌మ సెల్‌ఫోన్ ద్వారా ఈ చార్జింగ్ స్టేష‌న్ల‌ను గుర్తించ‌వ‌చ్చు. EV ఛార్జర్, సర్వర్ కనెక్షన్ ఛార్జర్‌లకు వేగవంతమైన నావిగేషన్, రిమోట్ ఛార్జింగ్ కంట్రోల్, బుకింగ్ సేవలతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల‌కు చ‌క్క‌ని ఎక్స్‌పీరియ‌న్స్ అందిస్తుంది. తమ ఉత్పత్తులను అధునాతన AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ML (మెషిన్ లెర్నింగ్) ఆధారిత అల్గారిథమ్‌లతో సహా పటిష్టమైన పవర్ టెక్నాలజీలతో రూపొందించి అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది,

EVIT ఛార్జింగ్ కేంద్రంలో ప్రామాణిక ఛార్జింగ్ ప్రోటోకాల్‌లతో సైట్‌లో సెంట్రల్ సర్వర్, మొబైల్ యాప్, ఛార్జర్ ఉంటాయి. EVI టెక్నాలజీస్ FY22-23 నాటికి ఎలక్ట్రిక్ టూవీల‌ర్‌, త్రీ-వీలర్ల కోసం భారతదేశంలోని వివిధ నగరాల్లో ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *