భారత ప్రభుత్వం అమలు చేస్తున్న FAME 2 పథకం కింద నమోదైన దాదాపు 62 ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు 11.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా విక్రయించాయి. FAME 2 పథకం కింద డిసెంబర్ 1, 2023 నాటికి మొత్తం రూ. 5,228.00 కోట్ల సబ్సిడీలను పొందాయి.
డిసెంబర్ 5, 2023న ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలపై లోక్ సభ సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ సింగ్ గుర్జార్ పై విషయాలను ధ్రువీకరించారు.
ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలను గురించి వివరిస్తూ FAME 2 పథకం ద్వారా సుమారు 10,16,887 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,21,374 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 14,818 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు, 3487 ఇ-బస్సులు లబ్ది పొందాయని ప్రభుత్వానికి వెల్లడించారు.
ప్రభుత్వం FAME ఇండియా స్కీమ్ IIవ దశను ముందుగా మూడు సంవత్సరాలకు నిర్ణయించారు. ఇది ఏప్రిల్ 2019 నుండి ప్రారంభమవుతుంది, మొత్తం బడ్జెట్ మద్దతు రూ. 10,000 కోట్లు. ఆ తర్వాత ఈ పథకాన్ని మరో రెండేళ్ల కాలానికి అంటే మార్చి 31, 2024 వరకు పొడిగించారు.
వివిధ నగరాలు, రాష్ట్ర రవాణా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఇంట్రాసిటీ కార్యకలాపాల కోసం కేంద్రం దాదాపు 6862 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు.
7,432 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల అభివృద్ధి కోసం పెట్రోలియం – సహజ వాయువు మంత్రిత్వ శాఖ (MoPNG) మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) ప్రభుత్వం 800 కోట్ల రూపాయల మూలధనాన్ని రాయితీలుగా మంజూరు చేసిందని మంత్రి గుర్జార్ తెలిపారు.
నవంబర్ 15, 2023 నాటికి వివిధ OEMల ద్వారా దాదాపు 5,094 కోట్ల క్లెయిమ్ లు దాఖలు చేశాయి. ప్రభుత్వం ఇప్పటికే రూ.3,815 కోట్లను పంపిణీ చేసిందని భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Good morning sir
I want car please full details
Super