
Farmer Kits | రేపు రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ
Farmer Kits Distribution Telangana : తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ అందజేయాలని నిర్ణయించింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు సచివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
61,125 మంది రైతులకు లబ్ధి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి క్లస్టర్ నుంచి 125 మంది రైతులను ఎంపిక చేయగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేయనున్నారు.
కిట్ (Farmer Kits) లో ఏముంటాయి?
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఈ కిట్‌లో ఈ క్రింది వస్తువులను పొందుపరిచారు:
- గుర్తింపు కార్డు (ID Card)
- క్షేత్ర దర్శిని డైరీ & చిన్న ప్యాకెట్ డైరీ
- ప్రత్యేక క్యాలెండర్
- క్లాత్ బ్యాగ్, టోపీ, పెన్ను
రైతు వేదికలలో పంపిణీ
సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పంపిణీని ప్రారంభించిన వెంటనే, ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఈ కిట్లను అందజేస్తారని అధికారులు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!
Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.
♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు



