Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు Paddy Procurement : రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. మద్దతు ధర...

Paddy Procurement : రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. మద్దతు ధర ఎంతంటే?

0
Paddy Procurement
de-oiled rice bran


Telangana Rabi Paddy Procurement 2026 | తెలంగాణలో ఈ రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurement:) పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Paddy) ప్రకటించారు. సోమవారం బేగంపేటలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Paddy Procurement : దిగుబడి అంచనా..

ఈ రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 54.48 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా, సుమారు 152.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో 60 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేయనున్నారు.

క్వింటాల్‌కు రూ. 2,389 మద్దతు ధర : కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రైతులకు గరిష్ట మద్దతు ధర (Paddy Support Price) ను అందించనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రేడ్-ఏ రకం: క్వింటాల్‌కు రూ. 2,389, సాధారణ రకం క్వింటాల్‌కు రూ. 2,369 పెరిగిన మద్దతు ధరతో రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

8,251 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

  • రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాలలో మౌలిక సదుపాయాలపై మంత్రి పలు సూచనలు చేశారు:
  • ఎలక్ట్రానిక్ తూకాలు, ఆటోమేటిక్ వరి క్లీనర్లు, తేమ కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచనున్నారు.
  • ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతులకు నీడ, మంచినీరు మరియు వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
  • కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ముందస్తుగా వాహనాలను సిద్ధం చేయాలని అధికారులను కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరుగుతోందని, ఇది రాష్ట్ర రైతాంగం సాధించిన విజయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు.


Previous articleMarket Holidays : వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు.. ఈ తేదీల్లో బంద్​!
Next articleFarmer Kits | నేడు రైతులకు ‘ఫార్మర్ కిట్స్’ పంపిణీ
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here