హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం
అమెరికా కాలిఫోర్నియాకు చెందిన EV తయారీ సంస్థ Fisker Inc. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని స్థాపించింది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్, వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్ సపోర్ట్ ఫంక్షన్‌లు, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర అంశాలపై పని చేయడానికి ఈ కొత్త ఆపరేషన్ సెంటర్‌ను ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. Fisker సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ విభాగానికి Fisker Vigyan India Pvt Ltd అని పేరు పెట్టారు. USAలోని కాలిఫోర్నియాలో Fisker బృందంతో కలిసి పని చేసేందుకు స్థానిక ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
Fisker Ocean Electric SUV
ఫిస్కర్ కంపెనీ తమ ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఫిస్కర్ ముందుగా తమ ఫిస్కర్ ఓషన్ (Fisker Ocean) ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో విడుదల చేస్తామని గతంలోననే ప్రకటించింది. Fisker Ocean Electric SUV టెస్లా కార్లకు పోటీగా నిలవనుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మోడల్ అమ్మకాలు, డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్ ప్రపంచ మార్కెట్లలో విడుదల కాకముందే 40,000 బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది
ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ SUV.. ఆస్ట్రియాలోని గ్రాజ్‌లోని ఫిస్కర్ యొక్క తయారీ భాగస్వామి మాగ్నా స్టెయిర్ కు చెందిన కార్బన్-న్యూట్రల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఇది నాలుగు వేరియంట్లలో వస్తుంది. అవి స్పోర్ట్, అల్ట్రా, ఎక్స్‌ట్రీమ్ మరియు వన్.
ఫిస్కర్ దాని బ్యాటరీ సరఫరాదారు CATLతో విస్తృతంగా పని చేసింది. వారు ఫిస్కర్ ఓషన్ లైనప్ కోసం పనితీరును పెంచడానికి, తయారీ ఖర్చును తగ్గించడానికి విస్తృత పరిశోధనలు చేశారు.
ఓషన్ స్పోర్ట్
ఇది బేస్ వేరియంట్. దీని ధరలు 37,499 డాలర్ల (సుమారు రూ.28.59 లక్షలు) నుంచి ప్రారంభమవుతాయి. సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 440 కి.మి రేంజ్ ఇస్తుంది. 275 హెచ్‌పి (205kW) శక్తిని ఉత్పత్తి చేసే సింగిల్ మోటార్ (ఫ్రంట్ వీల్ డ్రైవ్) డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది. కాగా ఇది కేవలం 6.9 సెకండ్లలోనే 0 నుండి 100 కి.మి స్పీడ్‌ను అందుకుంటుంది.
ఫిస్కర్ ఓషన్ అల్ట్రా
ఈ రెండో ట్రిమ్ ధరలు 49,999 డాలర్లు (సుమారు రూ.38.11 లక్షలు)గా ఉండొచ్చు. ఇందులో 540 హెచ్‌పి (400kW) పవర్ ను ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ (ఆల్ వీల్ డ్రైవ్) డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది. ఇది ఫుల్ చార్జ్ పై గరిష్టంగా 610 కిమీ రేంజ్ ను ఇస్తుంది. ఇక ఈ వాహనం కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
ఫిస్కర్ ఓషన్ ఎక్స్‌ట్రీమ్
దీని ధర సుమారు 68,999 డాలర్లుగ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 630 కిమీ రేంజ్ ను అందిస్తుందని అంచనా. ఈ ఎలక్ట్రిక్ కారులో 550 హెచ్‌పి (410kW) శక్తిని జనరేట్ చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు. ఈ వాహనం కేవలం 3.6 సెకండ్లలోనే గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
ఫిస్కర్ ఛైర్మన్, CEO హెన్రిక్ ఫిస్కర్ మాట్లాడుతూ.. తాము ఇప్పటికే భారతదేశంలో స్థానికంగా నియామకాలను ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్‌లో తమ కొత్త బృందం కొన్నివారాల్లోనే పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. హెన్రిక్ ఫిస్కర్ కు ఆటోమోటివ్ పరిశ్రమలో ఘన చరిత్రే ఉంది. ఆయన ఇప్పటివరకు ప్రియమైన, ఐకానిక్ కార్లను డిజైన్ చేశారు. అందులో వీటిలో ఆస్టన్ మార్టిన్ V8 వాంటేజ్, DB9, BMW Z8 వంటి ప్రఖ్యాత మోడళ్లు ఉన్నాయి.
Wow