Harithamithra Telugu News

Home EV Updates Okinawa electric scooters రీకాల్ చేస్తోంది.. ఎందుకు?

Okinawa electric scooters రీకాల్ చేస్తోంది.. ఎందుకు?

0
electric vehicles sales 2023

ప్ర‌ముఖ Electric scooter  తయారీదారు Okinawa Autotech త‌మ వాహ‌నాల్లోని బ్యాటరీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి 3,215 బ్యాటరీలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. “ఇటీవలి ఒకినావా వాహ‌నం కాలిపోయిన సంఘటన, అలాగే కస్టమర్ భద్రత కోసం  కంపెనీ తాజా నిర్ణ‌యం తీసుకుంది.  భారతదేశంలోని ఏ Electric Vehicles తయారీ సంస్థ అయినా స్వచ్ఛందంగా రీకాల్ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవ‌చ్చు.

ఈవీ త‌యారీ సంస్థ Okinawa ఏడేళ్ల  క్రితం స్థాపించ‌బ‌డింది. దీని పోర్ట్ఫోలియోలో మూడు లోస్పీడ్‌, నాలుగు హై-స్పీడ్ స్కూటర్‌లు ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా ప్రారంభించ‌నున్నారు. సమగ్ర పవర్ ప్యాక్ హెల్త్ చెకప్ కోసం రీకాల్ చేస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఈ సంద‌ర్భంగా బ్యాటరీలు లూజ్ కనెక్టర్లు లేదా ఏదైనా డ్యామేజ్ ఉందా అనే అంశాల‌ను త‌నిఖీ చేస్తారు. భారతదేశంలోని ఒకినావా అధీకృత డీలర్‌లలో వినియోగ‌దారుల వాహ‌నాల‌కు  ఉచితంగా మరమ్మతులు చేస్తామ‌ని కంపెనీ తెలిపింది.

మార్చి 26న వెల్లూర్‌లో ఒకినావాఒకినావా ప్రైస్ ప్రో వాహ‌నాన్ని ఛార్జ్ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి అలగే అతడి 13 ఏళ్ల కుమార్తె మృతిచెందారు. అలాగే ఏప్రిల్ 11న తిర్పూర్ లో Okinawa electric scooter లు కాలిపోయాయి. రెండు నెల‌లుగా ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ EV, జితేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలకు గురయ్యాయి.

ఏదైనా వాహనం మంటల్లో చిక్కుకుంటే EV తయారీదారులు స్వచ్ఛందంగా బ్యాచ్‌ని రీకాల్ చేయాలని నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ చెప్పిన వెంటనే ఈ రీకాల్ ప్రకటన వచ్చింది. కాంత్.. ఎల‌క్ట్రిక్ వాహన కంపెనీల‌ను బ్యాటరీలను సరిగ్గా పరీక్షించాలని, బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మార్చి 13న ఆదేశించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకోవడంపై ఆందోళన వ్యక్తం చేయడంపై కాంత్ స్పందించారు.

ఈవీ అగ్ని ప్రమాదాలపై నేవల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL), విశాఖపట్నం, సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులతో ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

Previous articleఇండియాకు Fisker ల‌గ్జ‌రీ ఎల‌క్ట్రిక్ కార్లు
Next articleLML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here