
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు.వలస జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతో కీలకమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చి త్వరగా పూర్తి చేయించాలని సభా ముఖంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల ఎ...