Home » రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

PM E-DRIVE subsidy scheme
Spread the love

PM E-DRIVE subsidy scheme | దేశంలో ఎల‌క్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లను ప్రోత్స‌హించేందుకు, ఛార్జింగ్ మౌలిక‌ళ‌ వసతుల క‌ల్ప‌న‌కు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.10,900 కోట్లతో ‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలయిన EMPS-2024 (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో PM E-DRIVE పథకాన్ని తీసుకొచ్చింది.   ఈ కొత్త ప‌థ‌కం 2024 అక్టోబరు 1 నుంచి 2026 మర్చి 31 వరకు అమలులో ఉండనుంది.

ఈవీల‌పై సబ్సిడీ ఇలా..

విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు వాటిలో వినియోగించే బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా సబ్సిడీ వ‌ర్తింప‌జేస్తున్నారు. కిలోవాట్‌ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ అందించ‌నున్నారు. మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో రూ.10,000ను మించదు. రెండో
సంవత్స‌రం కిలోవాట్‌కు రూ.2,500 చొప్పున ఉంటుంది. అయితే మొత్తం ప్రయోజనం రూ.5,000ను మించదు. ఇక త్రిచక్ర వాహనాలకు (ఇ-రిక్షాలు సహా) మొద‌టి సంవవ‌త్స‌రం రూ.25,000, రెండో సంవత్స‌రం రూ.12,500 చొప్పున ప్రోత్సాహకాలు అందించ‌నున్నారు. మ‌రోవైపు ఎల్‌5 విభాగం ( రవాణా త్రిచక్ర వాహనాలకు)లో మొద‌టి సంవ‌త్స‌రం రూ.50,000, రెండో సంవ‌త్స‌రం రూ.25,000 చొప్పున ఇస్తారు.

భార‌త‌ మార్కెట్ లో ప్ర‌స్తుతం ఓలా ఎల‌క్ట్రిక్‌, బ‌జాజ్ చేత‌క్‌, టీవీఎస్ ఐక్యూబ్‌, ఏథర్, హీరో విడా, ఎంపియ‌ర్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ బ్యాటరీ కెపాసిటీ 2.88-4 కిలోవాట్‌ అవర్‌ శ్రేణిలో ఉండగా..ఈ వాహన ధరలు రూ.90,000-1,50,000 మధ్య ప‌లుకుతున్నాయి

సబ్సిడీ ఎలా పొందాలి

వినియోగ‌దారులు త‌మ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సిడీ పొందేందుకు కేంద్రం మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించ‌నుంది. దీంతో ఈ పథకం కింద ఈ-ఓచర్లను అందించడం ద్వారా మొత్తం ప్రక్రియను సుల‌భతరం చేయ‌నుంది. ఒక ఆధార్‌ నంబర్‌పై ఒక వాహనాన్నే అనుమతిస్తారు. కొనుగోలు చేసిన వెంటనే అధికారిక‌ పోర్టల్‌లో ఆధార్‌ ఆధారిత ఇ-ఓచర్‌ జనరేట్‌ అవుతుంది. దానిపై సంతకం చేసి డీలరుకు అందిస్తే, స‌బ్సిడీ ప్రోత్సాహకాలు పొందొచ్చు.

PM E-DRIVE subsidy scheme  ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ విభాగంలోని ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్‌లు, ట్రక్కులు, ఇతర వాహనాలకు రూ.3,679 కోట్ల మేర సబ్సిడీలను అందించ‌నున్నారు. ఇక కార్లకు 22,100 ఫాస్ట్‌ ఛార్జర్‌ వసతులను, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు 48,400 ఫాస్ట్‌ ఛార్జర్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.2,000 కోట్లు కేటాయించారు.

సబ్సిడీ లభించే వాహనాల సంఖ్య  

  • e-2 వీలర్లు  24,79,120 
  • ఇ-రిక్షాలు & ఇ-కార్ట్  1,10,596 
  • e-3 వీలర్లు (L5) 2,05,392 
  • ఇ-బస్సులు 14,028 
  • EV PCS 72,300 
  • టెస్టింగ్ ఏజెన్సీల అప్‌గ్రేడేషన్780
  • మొత్తం వాహనాలు 28,81,436 

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *