2022 చివరి నాటికి 1000 సేల్స్ సర్వీస్ పాయింట్స్
Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆదరణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్నట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడక్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలోని 500కి పైగా నగరాల్లో 700+ సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్ ఉందని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.
హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం కంఫర్ట్ స్పీడ్ కింద హీరో అట్రియా, హీరో ఫ్లాష్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సిటీ స్పీడ్ సెగ్మెంట్‌లలో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా HX, NYX HX ఉన్నాయి. కొవిడ్ సమయంలోనూ 4 లక్షలకు పైగా స్కూటర్లు విక్రయించి హీరో ఎలక్ట్రిక్ తన డీలర్లను నిలబెట్టుకోగలిగింది.
తాజా పరిణామంపై Hero Electric సీఈవో సోహిందర్ గిల్ మాట్లాడుతూ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల నిర్వహణ, వినియోగం, నిర్వహణలో కస్టమర్‌కు ఎదురయ్యే ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తమ సర్వీస్ పాయింట్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
Nice