ఆటోమొబైల్ దిగ్గజం Hero MotoCorp ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ విజన్‌లో భాగంగా ఇ-మొబిలిటీ కోసం వ్యూహాత్మకంగా ముంందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవలే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రూ.420 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో పెట్టుబడి పెట్టనుంది.
విజన్ ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ
హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ – మాట్లాడుతూ “మా విజన్ ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’కి అనుగుణంగా మేము మొబిలిటీ సొల్యూషన్స్‌పై పని చేస్తున్నాము. మేము ఏథర్ ఎనర్జీలో మొదటి పెట్టుబడిదారులలో ఒకరిగా ఉన్నామని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఏథర్ ఎనర్జీ వృద్ధిని చూసి సంతోషిస్తున్నట్లు తెలిపారు.
Hero MotoCorp బ్రాండ్ను విస్తరించడం EV మొబిలిటీని ప్రపంచవ్యాప్తంగా కస్టమర్‌లకు అనుకూలమైన, అవాంతరాలు లేని అనుభవాన్ని అందించడమే మా లక్ష్యమని వ్యాఖ్యానించారు.
Hero Moto Corp తొలిసారిగా అక్టోబరు 2016లో బెంగుళూరుకు చెందిన EV స్టార్టప్ అయిన ఏథర్ ఎనర్జీలో సిరీస్ B ఫండింగ్‌లో పెట్టుబడి పెట్టింది. Hero MotoCorp Ather ఎనర్జీలో తన వాటాను 34.58 శాతానికి పెంచుకోవడానికి 2020 జూలైలో మళ్లీ రూ. 84 కోట్లు పెట్టుబడి పెట్టింది. సిరీస్ D రౌండ్‌లో భాగంగా రూ.89 కోట్లు పెట్టుబడి పెట్టింది.
ఈ పెట్టుబడిని అనుసరించి, Hero యొక్క షేర్‌హోల్డింగ్ పెరగడానికి సిద్ధంగా ఉంది. Ather ద్వారా మూలధన సమీకరణ రౌండ్ పూర్తయిన తర్వాత ఖచ్చితమైన షేర్ హోల్డింగ్ నిర్ణయించబడుతుంది.
Hero MotoCorp మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్
Hero Moto Corp ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, సోర్సింగ్ వంటి వివిధ రంగాలలో Atherతో సహకారాన్ని కూడా అన్వేషిస్తోంది. అభివృద్ధి చెందుతున్న మొబిలిటీ అవకాశాన్ని సమగ్ర పద్ధతిలో పరిష్కరించడంపై ఈ కంపెనీలు దృష్టి సారించాయి. మరోవైపు Hero MotoCorp తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2022 మార్చి లో ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త వాహనం సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో అభివృద్ధి చేయబడుతోంది. జైపూర్‌లోని టెక్నాలజీ (CIT) మ్యూనిచ్ సమీపంలోని టెక్ సెంటర్ జర్మనీ (TCG) – ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న దాని తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేయబడుతుంది.
Wow
[…] Ather 450 ప్లస్ ధర రూ.1.31 లక్షల నుండి 450X (ఎక్స్-షోరూమ్, రాష్ట్ర సబ్సిడీలు లేకుండా) రూ. 1.50 లక్షల వరకు ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసిన Ather 450 ధర పెరిగే అవకాశం ఉంది. అయితే 2022 మోడల్‌లోని పెద్ద బ్యాటరీ స్కూటర్‌కు రూ. 50,000 కంటే ఎక్కువ FAME-II సబ్సిడీ లభించనుంది. ప్రస్తుత Ather 450X, ఏథర్ 450 Plus కు రూ. 43,500 మేర FAME-II సబ్సిడీ ఉంది. కాగా కొత్త ఏథర్ మోడల్‌కు iQube ST, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ ఇవ్వనున్నాయి. […]