Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Zypp Electric తో బ్యాట‌రీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం

Spread the love

zypp electric mobility
Zypp Electric : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్దదైన‌ బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ బ్యాటరీ స్మార్ట్, దేశంలోని ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Zypp ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2000 Zypp ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీ స్మార్ట్ నెట్‌వర్క్‌లో క‌నెక్ట్ చేయ‌బ‌డ‌తాయి. తద్వారా ఎల‌క్ట్రిక్ వాహ‌న డ్రైవర్‌లు ఢిల్లీ NCR ప్రాంతంలోని 175కుపైగా ఉన్న బ్యాట‌రీ స్వాప్ స్టేషన్‌లో బ్యాట‌రీల‌ను సులువుగా మార్చుకునే వెలుసుబాటు క‌లుగుతుంది. ఇప్పటికే 200 వాహనాల పైలట్‌ పనులు కొనసాగుతున్నాయి.

బ్యాటరీ స్మార్ట్ సంస్థ ప్రత్యేకమైన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ద్వారా Zypp ఎల‌క్ట్రిక్ వాహ‌నాల డ్రైవర్లు డిస్‌చార్జ్ అయిన బ్యాట‌రీల‌ను మార్చుకొని విలువైన సమయాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. బ్యాటరీలను ఏ ప్రదేశంలోనైనా మార్చుకోవడానికి ఈ బ్యాట‌రీ స్మార్ట్‌ను నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివ‌ల్ల గంట‌ల‌పాటు చార్జింగ్ పెట్ట‌కునే బాధ త‌ప్పుతుంది మ‌రోవైపు వాహ‌నం ఎక్కువ కాలం పాటు రోడ్డుపై ఉండేలా చేస్తుంది.

బ్యాటరీ స్మార్ట్ స్పీకింగ్ సహ వ్యవస్థాపకుడు మిస్టర్ పుల్కిత్ ఖురానా మాట్లాడుతూ.. Zypp Electric తో త‌మ భాగస్వామ్యం క‌మ‌ర్షియ‌ల్ ద్విచక్ర వాహనాలకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, పెరుగుతున్న మా నెట్‌వర్క్ వినియోగాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుందని తెలిపారు. దేశంలో బ్యాటరీ మార్పిడికి అతిపెద్ద నెట్‌వర్క్‌గా సాధారణంగా లాజిస్టిక్స్ సెగ్మెంట్ EVల‌లో చార్జింగ్ టైంపై ఆందోళ‌న తగ్గించడంలో సహాయం చేస్తామని పేర్కొన్నారు.

Zypp Electric సహ వ్యవస్థాపకుడు & CEO ఆకాష్ గుప్తా మాట్లాడుతూ.. “దేశంలో బ్యాటరీ మార్పిడి యొక్క అతిపెద్ద నెట్‌వర్క్‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకున్నందున మా డ్రైవర్లు ఎక్కువ కాలం పాటు రోడ్డుపై ఉండేందుకు సహాయపడుతుంద‌న్నారు. Zypp వద్ద ప్రజల కోసం సరైన ఈవీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని పర్యావరణ స‌హిత ర‌వాణా విధానాల‌కు మేము ఎల్లప్పుడూ క‌ట్టుబ‌డి ఉంటామ‌ని తెలిపారు.

 

 

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *