Home » Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

Hero MotoCorp Hero vida v1 offers
Spread the love

దీపావళి తర్వాత కూడా ఆఫర్ పొడిగింపు

దీపావళి ఉత్సవాల ముగింపు తర్వాత కూడా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ ను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మొత్తం రూ.17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.1,35,705 లకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.
దీపావళి వేడుకలు ముగిసినప్పటికీ, Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుబంధ సంస్థ, Vida, దాని ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను పొడిగించింది. ఈ ఆఫర్ గురించి కంపెనీ ఇటీవలే తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, X లో పోస్ట్ ద్వారా వెల్లడించింది.

పండుగ సీజన్‌కు మించి ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారుల కోసం కొనసాగిస్తున్నామని, దీపావళి సందర్భంగా కొనుగోలును వాయిదా వేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కంపెనీ కోరింది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం.. దీపావళి తర్వాత కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి రూ.17,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌ల గురించి వివరాలు పరిమితంగా ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు సమగ్ర సమాచారాన్ని పొందేందుకు షోరూమ్‌ని సందర్శించాల్సి ఉంటుంది.

Hero vida v1  ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషిఫికేషన్స్

Vida V1 అనేది Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ విభాగం నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఒక్కసారి చార్జిపై 110 కిలోమీటర్ల వరకు రేంజ్ ను అందిస్తుంది. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది కేవలం 3.2 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇక చార్జింగ్ విషయానికొస్తే ఈ స్కూటర్‌ను దాదాపు 65 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫీచర్లు..

Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే.. ఈ వాహనంలో LED, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్, స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచడానికి కస్టొమైజ్డ్ సీట్లు వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నాలుగు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.  అవి ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్. ఇవి వినియోగదారుల అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు.

Vida V1 లో మరో ప్రత్యేకత మల్టిపుల్ ఛార్జింగ్ ఆప్షన్స్.. ఇందులో డిటాచబుల్ బ్యాటరీ, పోర్టబుల్ ఛార్జర్, DC ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం స్కూటర్ VIDA APPతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షలు, వివిధ రాష్ట్రాల్లో ధరలు మారవచ్చు. EMI ద్వారా కొనుగోలుకు కూడా అవకాశం ఉంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Green Mobility, Environment న్యూస్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

One thought on “Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *