Harithamithra Telugu News

Home EV Updates Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా...

Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు

0
Ather 450S price

బ్యాటరీ పై ఐదు సంవత్సరాల వ్యారంటీ..

ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడానికి ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ (Ather Electric December ) కార్యక్రమాన్ని  రూపొందించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ప్రోగ్రామ్ . డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా  గణనీయమైన నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు,  కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

“ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్” ప్రోగ్రామ్ కింద , కస్టమర్‌లు మొత్తం రూ. 24,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 6,500 వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉంటాయి..  చొరవలో భాగంగా రూ. 5,000 మరియు కార్పొరేట్ ఆఫర్ ప్రయోజనాలలో అదనంగా రూ. 1,500 ఉన్నాయి. Ather కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు అయిన ఏథర్ 450X , ఏథర్ 450S లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ఏథర్ స్కూటర్లపై EMI ఆఫర్లు

Ather Energy కొనుగోలుదారులకు  ఆర్థికపరంగా వెసులుబాటు కలిగించేందుకు  Ather సంవత్సరానికి 5.99% వడ్డీ రేటు ఫైనాన్సింగ్ ప్లాన్‌ను అందిస్తోంది. EMI వడ్డీలపై రూ. 12,000 వరకు పొదుపు చేయవచ్చు. ఈ ఫైనాన్సింగ్ సొల్యూషన్, జీరో డౌన్ పేమెంట్, 60-నెలల EMI కాలపరిమితి వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు Ather 450X, 450S మోడల్‌ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది.

అదనపు బోనస్‌గా, ఈ ఆఫర్‌లను పొందే కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ. 7,000 విలువైన అథర్ బ్యాటరీ ప్రొటెక్ట్ ప్యాకేజీని అందుకుంటారు. ఈ సమగ్ర ప్యాకేజీ బ్యాటరీపై  5-సంవత్సరాలు లేదా 60,000 కి.మీ వారెంటీని కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీ రక్షణకు భరోసా ఇస్తుంది. ముఖ్యంగా ఇది పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 70% స్టేట్-ఆఫ్-హెల్త్ (SoH) గ్యారెంటీని కలిగి ఉంది. కస్టమర్లు తమ స్కూటర్ బ్యాటరీపై ధీమాగా ఉండే అవకాశం లభిస్తుంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

Previous articleGreen Buildings | గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?
Next articleHero vida v1 offers : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. 
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here