టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

Spread the love

e-bike-Hover-Scooter

Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెల‌లోనే స‌రికొత్త హోవ‌ర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.
హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించ‌నుంది. సాధారణ ధర రూ .74,999 కాగా, కంపెనీ ప్రారంభ ధర రూ .69,999 గా ప్ర‌క‌టించింది.
ఈ స్కూటర్‌ను ఢిల్లీలో లాంచ్ చేయ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో ముంబై, బెంగళూరు పూణే వంటి న‌గ‌రాల్లో ఆత‌ర్వాత ఇత‌ర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది.

110 Range/charge

బైక్ 40 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంటుంది. 60v 25Ah సామర్థ్యం క‌లిగిన లిథియం అయాన్ బ్యాటరీలతో వస్తుంది. బ్యాటరీ ఛార్జ్ కావడానికి 200 నిమిషాలు పడుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ-బైక్ 110కిలోమీటర్లు ప్ర‌యాణిస్తుంది. ఇ-బైక్ 3 సెకన్లలోపు 0-25kmph వేగాన్ని అందుకోగలదు.

ఇది ఇ బ్రేక్‌తో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇందులో పోర్టబుల్ ఛార్జర్ కూడా ఉంటుంది. ముందు రోటర్ పరిమాణం 200mm, వెనుక 180mm. ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్ టెలిస్కోపిక్‌ను కలిగి ఉండగా, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. టైర్ పరిమాణం 18 అంగుళాలు x 8.5 అంగుళాలు – 8 అంగుళాలు ఉంటుంది. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 200mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. హోవర్ – స్కూటర్ 1300 మిమీ వీల్‌బేస్ కలిగి ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

ఈ స్కూటర్‌ను ఢిల్లీలో లాంచ్ చేయ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో ముంబై, బెంగళూరు పూణే వంటి న‌గ‌రాల్లో ఆత‌ర్వాత ఇత‌ర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ ప్రస్తుతం స్కూట‌ర్ కొనుగోలు కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. 25 నవంబర్ 2021 నాటికి డెలివరీలను ప్రారంభిస్తుంది.

12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి గోవా జైపూర్ వంటి పర్యాటక ఆకర్షణల కోసం స్కూటర్ ప్రత్యేకంగా రూపొందించబడిందని కంపెనీ పేర్కొంది. రెండు సీట్లు క‌లిగిన ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 250 కిలోల లోడ్ మోసే సామర్థ్యం ఉంటుంది. ​​ముందు వెడ‌న‌క డిస్క్ బ్రేక్‌లు అలాగే ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. ఇందులో డ్యూయల్ షాక్అబ్జ‌ర్బ‌ర్స్‌ను చూడ‌వ‌చ్చు. ఇక దీని స్పీడ్ గంట‌కు 25 కి.మీ. దీని పరిమిత వేగం కారణంగా వినియోగదారుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

భారతదేశంలోని విస్తారమైన ఆటోమొబైల్ రంగంలో టీనేజర్ల కోసం వ్యక్తిగత వాహ‌నాల విష‌యంలో త‌క్కువ ఆప్ష‌న్లు ఉన్నాయ‌ని తాము గ్ర‌హించిన‌ట్లు క‌ర్రిట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు మయూర్ మిశ్రా చెప్పారు. దీంతో హోవర్‌ను పరిచయం చేయాలనే ఆలోచన ప్రారంభమైందని వివ‌రించారు. 12-17 సంవత్సరాల మధ్య వయస్సు గల పాఠశాలకు వెళ్లే పిల్లల కోసం ప్రత్యేకంగా దేశంలో మొట్ట‌మొద‌టిసారి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెడుతున్నామని ఆయ‌న తెలిపారు.

విభిన్న రంగుల్లో Hover Electric Scooter

హోవర్ స్కూటర్ రెడ్, ఎల్లో, బ్లూ, పింక్, పర్పుల్, బ్లాక్ వంటి విభిన్న రంగులలో అందుబాటులో ఉంది. అలాగే కస్టమర్ల అభ్యర్థన మేరకు కస్టమైజ్ చేసుకునే వెసులుబాటు కూడాఉంది. కొరిట్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను లోన్ ద్వారా కూడా తీసుకోవ‌చ్చు. వారు కోరుకున్నంత కాలం బైక్‌ను లీజుకు తీసుకోవచ్చు. హోవర్ స్కూటర్ కూడా మూడేళ్ల తర్వాత హామీ విలువతో బై బ్యాక్ ఆప్షన్‌తో వస్తుంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..