
Ethanol E27 : పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుంచి 27%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ఇంధనాన్ని E27గా పిలవాలని నిర్ణయించంది. ఇంధనం కోసం కొత్త నిబంధనలను రూపొందించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి అప్పగించింది. TOI నివేదిక ప్రకారం, మొదటి విడత సంప్రదింపులు వచ్చే వారం జరగనున్నాయి.
E27 పెట్రోల్, IBA డీజిల్
కొత్త E27 పెట్రోల్‌కు అనుగుణంగా ఇంజిన్‌లను సవరించడం గురించి పరిశోధన నిర్వహించాలని భారతదేశ వాహన పరీక్ష, ధృవీకరణ సంస్థ ARAIని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది.
అధికారుల బృందం త్వరలో ఒక నివేదికను సమర్పించనుంది. భారతదేశం క్లీనర్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న క్రమంలో ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.
డీజిల్‌లో 10% ఐసోబుటనాల్ (IBA) మిశ్రమానికి ప్రభుత్వం ప్రమాణాలను రూపొందిస్తోందని వర్గాలు తెలిపాయి. అయితే, దీనికి డీజిల్ ఇంజిన్లలో మార్పులు అవసరం. ఒక అధికారి ప్రకారం, “ప్రత్యామ్నాయ ఇంధనాలపై కేంద్రం దృష్టి కేంద్రీకరించింది.
Ethanol : ఇథనాల్ తో కొన్ని చిక్కులు
తక్కువ మైలేజ్ కారణంగా ఇథనాల్ పెట్రోల్ గురించి ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఇథనాల్ కలిపిన ఇంధనం నీటిని పీల్చుకునే సామర్థ్యం కారణంగా ట్యాంక్‌లో పోసినపుడు తుప్పు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇథనాల్ హైగ్రోస్కోపిక్, అంటే ఇది నీటిని గ్రహిస్తుంది. పెట్రోల్‌లో ఎక్కువ ఇథనాల్ ఉంటే, అందులో నీరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇంధన ట్యాంక్, మొత్తం ఇంధన సరఫరా వ్యవస్థను తుప్పు పట్టేలా చేస్తుంది. ఈ తుప్పుపట్టిన కణాలు ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థలోకి కూడా ప్రవేశించి నష్టాన్ని కలిగిస్తాయి. దీనివల్ల మరమ్మతులకు లోనయ్యే అవకాశం ఉంది.
తుప్పును నివారించడానికి ఒక మార్గం ఏమిటంటే, ఇంధనాన్ని ట్యాంక్‌లో ఎక్కువసేపు ఉంచకుండా చూసుకోవాలి. సమస్యను నివారించడానికి దాన్ని నాల్గింట మూడు వంతులు నింపడం. అయితే, పర్యావరణ హితమైన ఇంధనం కోసం కేంద్రం చర్యలుచేపట్టింది. దీనికోసం మైలేజీని త్యాగం చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.