అక్టోబర్ 2021లో Joy e-bike 502% అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ఒక్క నెలోనే 2,855 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు విక్రయించి రికార్డు సృష్టించింది. జాయ్ ఇ-బైక్ తయారీదారు అయిన వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్., అక్టోబర్ 2021 నెలలో తన సేల్స్ నివేదికను ప్రకటించింది.
ఇండియాకు చెందిన Wardwizard Innovations & Mobility Limited సంస్థ జాయ్ ఇ-బైక్ బ్రాండ్ పేరుతో దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయిస్తోంది. కంపెనీ FY22 రెండవ త్రైమాసికానికి (జూలై- సెప్టెంబర్ 2021) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జాయ్ ఇ-బైక్ గత నెలలో కంపెనీ భారీస్థాయిలో అమ్మకాలతో అక్టోబర్ 2021ని ముగించింది. 2021 అక్టోబర్‌లో యోవై ప్రాతిపదికన కంపెనీ 502 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏ త్రైమాసికంలోనూ ఇంత అత్యధిక ఆదాయాన్ని సాధించలేదు.
Joy e-bike అక్టోబర్ 2021లో భారతదేశంలో 2,855 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లను విక్రయించింది, అయితే గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ కేవలం 474 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. ఫలితంగా 502 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2021 నెల నాటికి కంపెనీ 13 శాతం కంటే ఎక్కువ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. దాని అమ్మకాలు 2,500 యూనిట్లుగా ఉన్నాయి. పండుగల సీజన్ కారణంగా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని కంపెనీ పేర్కొంది.
Joy e-bike సేల్స్‌పై వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తే మాట్లాడుతూ, “ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు వడోదర తయారీ ప్లాంట్‌లోని మా కొత్త ఆటోమేటిక్ అసెంబ్లింగ్ లైన్ మాకు సహాయపడుతోంది. మా ‘జాయ్ ఇ- అనేక ప్రదేశాలలో బైక్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలు మరింత కస్టమర్‌లను లక్ష్యంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. “ఈ పండుగ సీజన్ దేశవ్యాప్తంగా పండుగ ఆనందాన్ని తెచ్చిపెట్టింది. తమ అన్ని టచ్ పాయింట్ల వద్ద అదనంగా ఆర్డర్‌లను స్వీకరిస్తున్నామని తెలిపారు. నవంబర్ మొదటి వారంలో,ముఖ్యంగా ధన్‌తేరాస్, దీపావళి వంటి సందర్భాలలో అధిక రిటైల్ అమ్మకాలు జరిగాయని తెలిపారు.
Nice