Kapas Kisan App

Kapas Kisan App : రైతుల చేతుల్లోనే మొత్తం మార్కెట్‌ సమాచారం, చెల్లింపుల వివరాలు!-

Spread the love

Kapas Kisan App : భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి రైతుల ప్రయోజనార్థం రూపొందించిన “కపాస్ కిసాన్ యాప్” ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింది. ఈ యాప్‌ ద్వారా రైతులు తమ ప్రాంతంలోని పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు, రోజువారీ మార్కెట్ ధరలు, కనీస మద్దతు ధర (MSP), అమ్మకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, చెల్లింపుల స్థితి వంటి పూర్తి స‌మాచారం మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.

కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) అనేది భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) రూపొందించిన మొబైల్ అప్లికేషన్. ఇది పత్తి రైతులకు (Cotton Farmers) ఉపయోగపడేలా రూపొందించింది. ఈ యాప్ ముఖ్యంగా పత్తి సాగు, కొనుగోలు ధరలు, మార్కెట్ సమాచారం వంటి అంశాలను సులభంగా తెలుసుకోవ‌చ్చు.

క‌పాస్ కిసాన్‌ యాప్‌లోని “Market Rate” ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పత్తి ధరలు (MSP – Minimum Support Price) ప‌త్తి రైతులు తెలుసుకోవచ్చు.

అలాగే పత్తి సాగు పద్ధతులు, పురుగు మందుల వాడకం, నీటిపారుదల విధానాలు, ప్ర‌భుత్వం నుంచి వచ్చే కొత్త మార్గదర్శకాలు వంటి సూచనలను కూడా ఈ యాప్‌ ద్వారా రైతులకు అందజేస్తున్నారు. డిజిటల్ యుగంలో రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని వ్యవసాయ శాస్త్ర‌వేత్త‌లు, నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు..

  • రైతులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, పత్తి అమ్మకం తర్వాత చెల్లింపుల వివరాలను యాప్‌లో చూసుకోవచ్చు.
    సమయానుసారం పత్తి విత్తనం, ఎరువులు, పురుగుమందులు, నీటిపారుదల వంటి సూచనలు లభిస్తాయి.
  • సర్కార్ నుంచి లేదా CCI నుంచి వచ్చే ముఖ్యమైన ప్రకటనలు, ధరలు, మార్కెట్ అప్‌డేట్స్ యాప్‌లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
  • ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు కొన్ని భారతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

 Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం  X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

More From Author

New Agriculture Schemes 2025

రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

Tata Punch EV

దీపావళి ధమాకా: టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫర్లు! Tata EV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ...