Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డు

Hyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న‌ కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ 10.53 కోట్లతో 514 గృహాల‌తోపాటు 11 ప్రభుత్వ భవనాలకు
సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 KW స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 KW సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 KW ఉందిజ మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే, ఇండ్లపై సోలార్ ప్యాన‌ల్స్‌ను బిగించనున్నట్లు TG REDCO మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి వెల్ల‌డించారు.

Solar Village Project : మొత్తం రూ.10.53కోట్ల వ్య‌యం

కొండారెడ్డిపల్లి గ్రామం సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు మొత్తం రూ. 10.53 కోట్లు వెచ్చించారు. అందులో రూ.7.96 కోట్లతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్ కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.3.56 కోట్లు , M/s Premier Energies కంపెనీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల
నుంచి రూ 4.092 కోట్లు ఖ‌ర్చుచేశారు. మరో రూ 2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు.
ప్రతి ఇంటి నుంచి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జ‌రుగుతుంది. (ప్రతి KW కు 120 యూనిట్స్ అవుతుంది) ఇండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను , ఇంటి వినియోగానికి పోగా, మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. గ్రిడ్‌కు పంపే విద్యుత్ యూనిట్‌కు రూ 5.25 చొప్పున చెల్లించేందుకు లబ్దిదారులతో
విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబర్ లో విద్యుత్ గ్రిడ్ కు గ్రామం మొత్తం నుంచి సుమారు ఒక లక్ష యూనిట్ల‌ విద్యుత్ ఎగుమతి అయింది. తద్వారా రూ 5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించారు.


 Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు