
Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డుHyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ 10.53 కోట్లతో 514 గృహాలతోపాటు 11 ప్రభుత్వ భవనాలకుసౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 KW స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 KW సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 KW ఉందిజ మట్టి గోడలతో ఉన్న 3...


