ఈ స్కూటర్ ను చూశారా ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ దీనిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.. ఇది ఎలక్ట్రిక్ వాహనం .. దీన్ని నడిపేందుకు పెట్రోల్ అవసరం లేదు.
ఇంతకీ అది ఏ స్కూటర్ అని ఆలోచిస్తున్నారా..? లెట్రిక్స్ (lectrix) అనే కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరు ఈ-సిటీ జిప్ (lectrix ECity electric scooter). ఇది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు. పర్సనల్, లేదా కమర్షియల్ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.
ఇది మిడ్ రేంజ్ స్పీడ్ స్కూటర్. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జింగ్ లో 75 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇందులో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్‌లో టాప్ స్పీడ్ 35. అదే మోడ్ 2లో అయితే గంటకు 45 వేగంతో వెళ్లొచ్చు. మోడ్ -1లో స్కూటర్ రేంజ్ 75 వరకు ఉంటుంది. అదే మోడ్-2లో 50కి మాత్రమే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 25 సెకన్లలోపు వేగంతో అందుకుంటుంది.
lectrix ECity కిలోమీటర్ కు 12 పైసలు
కంపెనీ ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోడ్ కెపాసిటీ 155 కిలోలు. గ్రౌండ్ క్లియరెన్స్ 165 ఎంఎం.. ఇందులో కంపెనీ 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని పొందుపరిచింది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ కాస్ట్ విషయానికి వస్తే.. కిలోమీటర్ కు కేవలం 12 పైసలు ఖర్చవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ లెక్కన 100 కిలోమీటర్లకు కేవలం రూ.12 ఖర్చు అవుతుంది.
మొబైల్ యాప్ కనెక్టివిటీ
ఈ బైక్ బ్యాటరీ ఛార్జింగ్ కు 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎరుపు, ఆరెంజ్, గ్రీన్, బ్లాక్, వైట్ అనే రంగుల్లో అందుబాటులో ఉంది. lectrix ECity electric scooter ధర దాదాపు రూ. 1.15 లక్షలుగా ఉంది. ఈజీ లోన్ ద్వారా మీరు ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. మరో విశేషమేంటంటే.. మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఆప్షనల్ బ్యాటరీ ప్యాక్ సెటప్ కూడా ఉంటుంది.. హెవీ డ్యూటీ బీఎల్‌డీసీ హబ్ మోటార్ అమర్చారు. తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడానికి భావించే వారు దీన్ని ఒకసారి కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.