Lectrix EV LXS 2.0 electric scooter price in India : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ఇందులో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు ఆటోమొబైల్ సంస్థలు పోటీపడి సరికొత్త ఈవీలనుమార్కెట్ లోకి వదులుతున్నాయి. తాజాగా ఎస్ఏఆర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (SAR Electric Mobility) లో భాగమైన టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ (Lectrix EV).. కొత్తగా LXS 2.0 పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రారంభించింది. ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధర తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
లెక్ట్రిక్స్ ఈవీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
లెక్ట్రిక్స్ ఈవీ కంపెనీకి మార్కెట్లో.. ఇప్పటికే ఎల్ఎక్స్ఎస్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. కొత్తగా లాంచ్ అయిన ఎల్ఎక్స్ఎస్ 2.0.. దాని కింది సెగ్మెంట్ లో నిలుస్తుంది. కొత్త Lectrix EV LXS 2.0 లో 2.3 kwh బ్యాటరీ ప్యాక్, బీఎల్డీసీ హబ్ మోటార్ఉం ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కి.మీ. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 98 కి.మీలు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
Lectrix EV LXS 2.0 range : 25 లీటర్ల అండర్ సీట్ బూట్ స్పేస్ ఉంటుంది. ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్, 90/100 ఫ్రెంట్- 110/90 10- ఇంచ్ టైర్లతో పాటు మరిన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మైలేజీతోపాటు బిల్ట్ క్వాలిటీ, డబ్బుక తగిన విలువ కోసం చూసే వినియోగదారుల కోసం తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎల్ఎక్స్ఎస్ 2.0 చక్కగా సరిపోతుందని లెక్ట్రిక్స్ ఈవీ కంపెనీ చెబుతోంది.
ఎస్ఏఆర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ, సీఈఓ క విజయ కుమార్ మాట్లాడుతూ.. “వాల్యూ కోసం చూసే వినియోగదారుల ఆలోచనలను మేము అర్థం చేసుకోగలం. అందుకే వారికి తగిన కొత్త ఈవీని తీసుకొచ్చాం. కొత్త -స్కూటర్.. ఇన్నోవేషన్, క్వాలిటీ విషయంలో మేం అస్సలు రాజీపడలేదు.” అని తెలిపారు.
లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ధర
Best electric scooter in India : లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర(ఎక్స్‌షోరూం) రూ. 79,999. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మార్చ్‌లో డెలివరీలు మొదలవుతాయని సమాచారం. ఇక ఈ స్కూటర్ కొనుగోలు దారులకు 3ఏళ్లు లేదా 3000 కి.మీల వరకు వారెంటీని ఇస్తోంది. ఇందులో యాంటీ థెఫ్ట్ సిస్టెమ్ కూడా ఉండడం విశేషం. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ కూడా ఉంది.. డోర్ స్టెప్ సర్వీస్‌ని కూడా అందిస్తామని కంపెనీ చెబుతోంది.కాగా తన పోర్ట్‌ఫోలియోలోని ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా 10వేలకుపైగా మందికి విక్రయించామని తెలిపింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..