భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ తాజాగా Mahindra & Mahindra గ్రూప్ తో జట్టు కట్టింది. దేశంలో EVల కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, అలాగే కంపెనీ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఈవీల స్వీకరణకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఏడాదికి మిలియన్ యూనిట్లు
పెట్రోల్ ధరలు పెరిగినప్పటి నుంచి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెరిగిన డిమాండ్ కారణంగా సకాలంలో వాహనాలను ఉత్పత్తి చేయలేక కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో
ఈవీ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి మహీంద్రా గ్రూపునకు చెందిన పితంపూర్ ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ బైక్‌లు – హీరో ఎలక్ట్రిక్ Optima తోపాటు హీరో NYXని తయారు చేయనున్నారు. వారి ప్రస్తుత లూథియానా పరిశ్రమ విస్తరణతో పాటు ఈ సహకారంతో.. హీరో 2022 సంవత్సరానికి 1 మిలియన్ EVలను తయారు చేయాలనే దాని లక్ష్యాన్ని సాధించగలదు.
ఈ రెండు సంస్థల భాగస్వామ్యం పై హీరో ఎలక్ట్రిక్ MD నవీన్ ముంజాల్ మాట్లాడుతూ.. “దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో హీరో ఎలక్ట్రిక్ అగ్రగామిగా ఉంది. తన మూలాలను మరింత లోతుగా తీసుకెళ్లేందుకు, అలాగే తమ లీడర్‌షిప్‌ను బలోపేతం చేయడానికి హీరో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్.. త్రీ/ ఫోర్ వీలర్స్ స్పేస్‌లో EV మార్పునకు నాయకత్వం వహిస్తున్న మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడం సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు పరిశ్రమల కలయిక ఈవీ డిమాండ్‌ను తీర్చడానికి, తయారీ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం ఉపయోగపడుతుందన్నారు.
దేశంలోని కొత్త కేంద్రాలను చేరుకోవడానికి మహీంద్రా గ్రూప్ సప్లై చైన్‌ను ఉపయోగించడం. దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్ల రెండు కంపెనీలు కూడా EVల గురించి ఒకరికొకరు లోతైన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాయని చెప్పారు. రాబోయే కొన్ని సంవత్సరాలలో కొత్త ప్రొడక్ట్‌ను అభివృద్ధి చేస్తాయని తెలిపారు.
భాగస్వామ్యంపై Mahindra & Mahindra లిమిటెడ్ ఆటో & ఫార్మ్ సెక్టార్‌ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ.. కొత్త ఉత్పత్తులు/ సాంకేతికతలను రూపొందించడానికి R&D బృందాల మధ్య పరిజ్ఞానాన్ని పంచుకోవడంలో సహాయపడటానికి రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని మరింతగా పెంచడమే కాకుండా, వేగవంతమైన ఈవీ స్వీకరణ కోసం కృషి చేస్తామని తెలిపారు.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.!
Wonderful