Maruti Suzuki EV : మారుతీ సుజుకీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..

Spread the love

Maruti Suzuki EV : ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి  శుభవార్త  త్వరలో సరికొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. తక్కువ ధరల్లో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన మారుతి ఈ ఏడాది ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకీ ఇటీవల వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ SUV eVX ప్రొడక్షన్ వెర్షన్‌ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే.. అయితే అన్నీ సవ్యంగా జరిగితే ఈ  సంవత్సరం దీపావళికి ముందు ఈ కారును అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేయవచ్చు.  నివేదికల ప్రకారం, Maruti Suzuki EV Car ధర రూ. 10లక్షల కంటే ఎక్కువగా ఉండొచ్చు. మరోవైపు తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌పై కూడా మారుతి దృష్టి పెట్టిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు రాజ్యమేలుతున్నాయి. టాటా టియాగో EV, టాటా టిగోర్ చాలా పాపులర్ అయ్యాయి. ఇటీవలే టాటా పంచ్ ఈవీని కూాడా విడుదల చేసి మిగతా కంపెనీలకు అందనంత ఎత్తుకు చేరుకుంది టాటా మోటార్స్.  ఇక  MG Comet EV వాటి తక్కువ ధరల కారణంగా మార్కెట్ లో చాలా పాపులర్ అయింది.

ఈ నేపథ్యంలో ఇండో-జపనీస్ కంపెనీ మారుతీ సుజుకి భారత ప్రజలను దృష్టిలో ఉంచుకుని కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్ కారును విడుదల చేయాలని భావిస్తోంది. అయితే దీనిని 2026-27 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మారుతి సుజుకీ కొత్త కాంపాక్ట్ hatchback EV కారు ఈ సంవత్సరం జపాన్ మొబిలి టీ షోలో ప్రదర్శించిన eWX కాన్సెప్ట్ మోడల్‌పై బేస్ అయి ఉంటుందని  తెలుస్తోంది. ఈ కారు విడుదల తర్వాత టాటాకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం. మారుతి సుజుకీ ఈ చోటా ఎలక్ట్రిక్ కారును K-EV ఆర్కిటెక్చర్‌లో డిజైన్ చేసి అభివృద్ధి చేయనుంది.

K-EV ఆర్కిటెక్చర్‌లో డిజైన్

ప్లాట్‌ఫారమ్ సాంకేతికత, ధరల పరంగా Wagon-R EV విఫలమైన తర్వాత.. మారుతి సుజుకి ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ ను K-EV ఆర్కిటెక్చర్‌లో డిజైన్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, కాంపాక్ట్ EV స్కేట్‌ బోర్డ్ ప్లాట్‌ఫారమ్ కూడా ఇందులో వినియోగించనుంది. విడి భాగాల తయారీని స్థానికంగా రూపొందించకుండా  ధరలను తక్కువగా ఉంచడం కష్టమని.. మారుతీ భారతీయ మార్కెట్‌ను పూర్తిగా అర్థం చేసుకుంది.. ఈ నేపథ అందువల్ల భారత గడ్డపై ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు కంపెనీ రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

మారుతీ సుజుకి డెన్సో, తోషిబాతో జతకట్టింది. ఈ భాగస్వామ్యంతో హైబ్రిడ్ వాహనాల కోసం బ్యాటరీ ప్లాంట్‌ను నిర్మించనుంది. అలాగే ఎలక్ట్రిక్ కార్లలో మిగ్-సైజ్ బ్లేడ్ సెల్ బ్యాటరీ ల కోసం eVX BYDతో  భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా మారుతి సుజుకి 2026-2027 నాటికి ఏకంగా ఆరు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..