ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు లిక్విడ్ కూల్డ్ ఈవీ బ్యాట‌రీలు

అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ MatterEnergy త‌న‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం స‌రికొత్తగా MatterEnergy 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీయ వాతావ‌ర‌ణం, ఈవీల‌ను వినియోగించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ బ్యాటరీ ప్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.

భవిష్యత్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాటరీ ప్యాక్‌ని అభివృద్ధి చేశామని MatterEnergy వ్యవస్థాపకుడు, CEO మోహల్ లాల్‌భాయ్ తెలిపారు. మ్యాటరెనర్జీ 1.0 బ్యాటరీ ప్యాక్ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IITMS) వంటి ప్రత్యేక లక్షణాలతో వస్తుంది. IITMS యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది భారతదేశంలో ఈ సాంకేతికతతో వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీ ప్యాక్‌గా నిలిచింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

బ్యాటరీ ప్యాక్ యొక్క భద్రత, బ్యాటరీ లైఫ్, పనితీరుకు ప్రాధాన్యతనిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా బ్యాటరీ కేసింగ్ తేలికైన మెటల్‌తో నిర్మించబడింద‌ని,. ఇది ఇతర పదార్థాలతో పోల్చినప్పుడు ఉష్ణ వాహకమ‌ని తెలిపారు. MatterEnergy 1.0 బ్యాటరీ అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటుంది, అలాగే IP67 వాటర్‌ప్రూఫ్ రేట్ కూడా ఉంది. దీని సూపర్ స్మార్ట్ BMS సరైన సిస్టమ్ సామర్థ్యం, భద్రత, విశ్వసనీయతను అందిస్తుందని తెలిపారు.

మాట‌ర్ ఎన‌ర్జీ కంపెనీ ఇటీవలే తన MatterDrive 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా IITMSతో విడుల చేసింది. CY 2022 మూడవ త్రైమాసికంలో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు మోహల్ లాల్‌భాయ్ వెల్లడించారు.

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Previous articleRevolt – RV400 బుకింగ్ ఓపెన్
Next articleఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here