MG Comet EV : సింగిల్ చార్జిపై 150 కిలోమీటర్ల మైలేజీ!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం MG తన రాబోయే స్మార్ట్ ఎలక్ట్రిక్ కారు Comet ప్రకటించింది. ఇది కేవలం 2,900mm పొడవు కలిగి Tiago EV, Citroen eC3 కంటే చిన్నదిగా ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యలకు MG Comet EV చక్కని పరిష్కారమని కంపెనీ పేర్కొంది. బ్రాండ్ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఖర్చులను తగ్గిస్తాయి.
MG Comet EV స్పెసిఫికేషన్స్
కామెట్ EV కేవలం 2.9 మీ పొడవు మాత్రమే ఉంటుందని అంచనా. దీంతో ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత పొట్టి కారుగా అవతరిస్తుంది. వాహనం డిజైన్ దాని చైనీస్ మోడల్ వులింగ్ ఎయిర్ EVని పోలి ఉండే అవకాశం ఉంది. దీని అర్థం MG కామెట్ EV 2,100mm వీల్‌బేస్‌తో బాక్సీ టాల్ బాయ్ డిజైన్‌ను కలిగి లోపలి భాగంవిశాలంగా ఉంటుంది.
MG కామెట్ EV 20-25kWh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. వాహనం లైట్ బార్‌లు, అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్‌లు, రెండు 10.25-అంగుళాల స్క్రీన్‌లు, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, వాయిస్ కమాండ్‌లు, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉండవచ్చు. అలాగే, సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఎల్‌ఈడీ ల్యాంప్‌లను పొందవచ్చని భావిస్తున్నారు.
MG కామెట్ వాహనంలో 25kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 38 bhp ఎలక్ట్రిక్ మోటారుతో ముందు చక్రాలను నడుపుతుందని భావిస్తున్నారు. ఈ కాంపాక్ట్ EV పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిమీ మైలేజీని ఇస్తుంది. పలు నివేదికల ప్రకారం, MG ఎయిర్ చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రీమియం ఆఫర్‌గా ఉంటుంది. టాటా టియాగో EV కంటే ఎక్కువగా ధర(ఎక్స్-షోరూమ్. ) రూ.8.69 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ఉంటుందని అంచనా.