విస్తరించనున్న చార్జింగ్ మౌలిక సౌకర్యాలు
దేశవ్యాప్తంగా EV (ElectricVehicles) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి MG Motor India తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో MG మోటార్ ఇండియా ‘green mobility’.(గ్రీన్ మొబిలిటీ) స్వీకరణను వేగంగా పెంచడానికి BPCLతో జతకట్టిన మొదటి ప్యాసింజర్ కార్ కంపెనీగా అవతరించింది.
ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను బలోపేతం చేయడానికి MG వేసిన మరో ముందడుగు. BPCLతో భాగస్వామ్యంతో ఇంటర్‌సిటీ ప్రయాణానికి అవకాశాలను విస్తరించడం ద్వారా EV స్వీకరణకు ఊపందుకోనుంది. ఎందుకంటే రెండు సంస్థలు హైవేలు, నగరాల్లో పెద్ద సంఖ్యలో EV Charging Stations ఏర్పాటు చేయనున్నాయి.
Bharat Petroleum Corporation Limited ( BPCL ) దేశంలో విస్తారమైన కస్టమర్ రీచ్, నెట్‌వర్క్ కలిగి ఉంది .. EV రంగంలో పురోగతి చెదుతున్న MG వంటి సంస్థలు.. కలిసి పనిచేయడం వల్ల వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఛార్జింగ్ సైట్‌లను సులువుగా గుర్తించడానికి, లాయల్టీ ప్రోగ్రామ్‌లను రూపొందించడానికి, ఛార్జింగ్ సిస్టమ్‌ల నిర్వహణ, కొత్త సాంకేతికతను రూపొందించడానికి ఈ రెండు సంస్థలు పనిచేయనున్నాయి.
ఈ అంశంపై MG మోటార్ ఇండియా ప్రెసిడెంట్/ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ.. “ఎలక్ట్రిక్ మొబిలిటీకి విజయవంతంగా మారడానికి కీలకమైనది EV పర్యావరణ వ్యవస్థ. 2020లో ZS EVని ప్రారంభించినప్పటి నుంచి MG బలమైన EV పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో ముందంజలో ఉంది. మా భాగస్వాములతో కలిసి, బ్యాటరీ రీసైక్లింగ్ & బ్యాటరీతో పాటు, EV ఛార్జింగ్ స్టేషన్‌ల యొక్క విస్తారమైన నెట్‌వర్క్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
BPCLతో తమ భాగస్వామ్యం EVలపై కస్టమర్ విశ్వాసాన్ని పెంపొందించడానికి, భారతదేశంలో EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశంలో BPCL యొక్క బలమైన నెట్‌ర్క్ దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న, కాబోయే కస్టమర్‌లు ఛార్జింగ్ సొల్యూషన్‌లకు అనుకూలమైన యాక్సెస్‌ను కలిగి ఉండేలా చేస్తుందని చెప్పారు. మేము EVని ఛార్జ్ చేసే అవకాశాలను మరింత విస్తరించడం, దాని వల్ల పర్యావరణ ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
AC/ DC ఛార్జర్‌లు,
MG మోటార్ ఇండియా.. మొదటి నుంచి నివాస కమ్యూనిటీలు అలాగే MG షోరూమ్‌లలో AC ఛార్జర్‌లు, DC ఫాస్ట్ ఛార్జర్‌లతో మల్టీ-స్టెప్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. MG తన కస్టమర్‌లకు 6వే ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను కూడా విస్తరిస్తోంది. ఇందులో ఉచిత ఖర్చుతో కూడిన AC ఫాస్ట్-ఛార్జర్ (కస్టమర్ యొక్క ఇల్లు/కార్యాలయంలో ఇన్‌స్టాల్ చేయబడింది). అలాగే ఛార్జింగ్ నెట్‌వర్క్, ప్లగ్-అండ్-ఛార్జ్ కేబుల్ ఆన్‌బోర్డ్, RSA (రోడ్‌సైడ్ అసిస్టెన్స్), మరియు కమ్యూనిటీ ఛార్జర్‌ల వంటి సౌకర్యాలను కల్పిస్తోంది.
BPCLతో ప్రతిపాదిత EV ఛార్జింగ్ నెట్‌వర్క్ EV వినియోగదారులకు నిరంతరాయ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది మరియు దేశం యొక్క EV తయారీ పర్యావరణ వ్యవస్థను పెంచుతుంది. ఈ భాగస్వామ్యం గురించి BPCL ఛైర్మన్/ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, రేంజ్ కు సంబంధించిన ఆందోళనలు తగ్గించేందుకు BPCL కృషి చేస్తోందని తెలిపారు.
fast-charging corridors
BPCL దేశంలోని ప్రధాన రహదారులు, ఇంటర్-కనెక్టింగ్ ప్రధాన నగరాల మీదుగా ఫాస్ట్-చార్జింగ్ కారిడార్‌లను ఏర్పాటు చేస్తోంది. రాబోయే మూడేళ్లలో దేశంలో సౌకర్యవంతంగా ఉండే 7000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫాస్ట్-ఛార్జింగ్ స్టేషన్‌లు అనేక సౌకర్యాలతో వస్తాయి. ఈ స్టేషన్లలో పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు, రిఫ్రెష్‌మెంట్లు, మైక్రో ATMలు మొదలైనవి ఉండనున్నాయి.