Harithamithra Telugu News

Home EV Updates Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద...

Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

0
Ather Rizta Price and launch date

Ather Rizta : ఏథర్ ఎనర్జీ న్యూ జనరేషన్ ఫ్యామిలీ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూర్లకు భిన్నంగా ఉండనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO, తరుణ్ మెహత రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారిక పేరును  కటించారు.

ఇటీవలి ట్వీట్‌లో, రాబోయే ఇ-స్కూటర్‌కు ‘రిజ్తా’ (Ather Rizta ) అని పేరు పెట్టనున్నట్లు మెహతా ధృవీకరించారు. బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ నుండి ఈ స్కూటర్ ఫ్యామిలీ అంతటికీ సరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు . అయితే మెహతా మరొక ట్వీట్‌ను పోస్ట్ చేసారు,

తాజా ట్వీట్ రిజ్టాలో ఆఫర్‌లో ఉన్న పెద్ద సింగిల్-పీస్ సీటును చూపుతున్న ఫొటోను చూపించారు. ఆ ట్వీట్ లో ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న  ఇ-స్కూటర్‌లలో కంటే పెద్దదైన సింగిల్-పీస్ సీటుు అందిస్తున్నట్లు వెల్లడించారు.  ఇది రైడర్ కు, పిలియన్ ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

Ather Rizta లో ఏమి ఆశించవచ్చు?

రిజ్టా గురించి చాలా తక్కువగా తెలిసినప్పటికీ,  ఈ స్కూటర్ ప్రస్తుత ఏథర్ 450ల నుండి పూర్తిగా భిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని స్పై షాట్‌లను బట్టి తెలుస్తోంది.  ఇది పైన పేర్కొన్న పెద్ద సీటును బట్టి చూస్తే.. సీటు కోసం విశాలమైన,  ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ ఉండనుంది. రాబోయే రిజ్టాతో Ather రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో వస్తుందని సమాచారం. ఇది 7.0-అంగుళాల ‘డీప్‌వ్యూ’ LCD ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను కూడా అందించగలదు – మొదట 450Sలో అందించారు. ఏథర్ రాబోయే ఇ-స్కూటర్‌ను ఈ ఏడాది జూన్‌లో జరిగే ఏథర్ కమ్యూనిటీ డే సెలబ్రేషన్ 2024లో ఆవిష్కరించనున్నారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Previous articleBajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..
Next articleMG Motor India : ఎంజీ మోటార్ శతాబ్ధి ఉత్సవాలు.. MG comet EV పై భారీ డిస్కౌంట్..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here